BigTV English

Dhanush on Radhika Sarath Kumar: నయన్ – విఘ్నేష్ సీక్రెట్ డేటింగ్ పై రాధిక పై మండిపడ్డ ధనుష్.. అసలేం జరిగిందంటే.?

Dhanush on Radhika Sarath Kumar: నయన్ – విఘ్నేష్ సీక్రెట్ డేటింగ్ పై రాధిక పై మండిపడ్డ ధనుష్.. అసలేం జరిగిందంటే.?

Dhanush on Radhika Sarath Kumar : గత కొద్ది రోజులుగా ధనుష్ (Dhanush), నయనతార (Nayanthara) వ్యవహారం కోలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన నయనతార ‘డాక్యుమెంటరీ: బియాండ్ ది ఫెయిరీ టేల్’ వీరి వివాదానికి కారణం అయ్యింది. ఇకపోతే ఈ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాలోని మూడు సెకండ్ల వీడియోని ఉపయోగించడమే పెద్ద సంచలనంగా మారింది. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరి కాదంటూ ధనుష్.. నయనతారకు నష్టపరిహారంగా రూ.10 కోట్ల రూపాయలు ఇవ్వాలని లీగల్ నోటీసులు పంపించారు.


ధనుష్ పై మండిపడుతూ పోస్ట్ చేసిన నయనతార..

అయితే ఈ విషయంపై స్పందించిన నయనతార.. ఏకంగా మూడు పేజీలు కలిగిన ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. “నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం రెండేళ్లు మీ చుట్టూ తిప్పించుకున్నారు. కానీ మీరు మాకు ఎన్వోసీ ఇవ్వలేదు. ముఖ్యంగా మీరు మీ నాన్న, మీ అన్నయ్య సహాయంతో ఈ స్టేజ్ కు వచ్చారు. కానీ నేను.. నా రెక్కల కష్టంతోనే ఈ స్థాయికి వచ్చాను” అంటూ తెలిపింది. దీంతో ఈ వివాదం కాస్త చర్చకు దారి తీసింది.


నయనతార – విఘ్నేష్ డేటింగ్ విషయంపై ధనుష్ ఏమన్నారంటే…

అయితే ఇదిలా ఉండగా.. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ (Radhika Sarath Kumar) కూడా స్పందించారు. నానుమ్ రౌడీధాన్ సినిమాలో కీలక పాత్ర పోషించిన రాధిక శరత్ కుమార్.. ధనుష్ ప్రవర్తన పై మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో నయనతార, విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan)ల ప్రేమ వ్యవహారం గురించి తనతో చెప్పాడు అంటూ ఆమె తెలిపింది.

ఈ విషయంపై రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. “ఈ సినిమా షూటింగ్ సమయంలో ధనుష్ నాకు ఫోన్ చేసి, ఈ విషయం చెప్పాడు. ధనుష్ ఫోన్లో మాట్లాడుతూ.. “అక్క నీకు సిగ్గుందా?” అని అడిగాడు. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు.. “నయనతార, విఘ్నేష్ డేటింగ్ చేస్తున్నారని నీకు తెలియదా?” అంటూ నన్ను ప్రశ్నించాడు. దాంతో నేను వెంటనే ” ఏం మాట్లాడుతున్నావ్..? నాకేం తెలియదు..” అంటూ షాకింగ్ కి గురైనట్లు డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది” రాధిక శరత్ కుమార్.

నయనతార డాక్యుమెంటరీలో స్టార్ సెలబ్రిటీస్..

ఇకపోతే నయనతార డాక్యుమెంటరీలో రానా దగ్గుబాటి (Rana Daggubati), నాగార్జున(Nagarjuna ), తమన్నా భాటియా(Tamannah bhatia), ఉపేంద్ర(Upendra ), విజయ్ సేతుపతి(Vijay Sethupathi), పార్వతి తిరువోతు (Parvathi thiruvothu), అట్లీ (Atlee)లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా కనిపించారు. అయితే ఇంతమంది ఈ డాక్యుమెంటరీకి సహాయపడ్డారు. కానీ ధనుష్ మాత్రం మూడు సెకండ్ల క్లిప్ ఉపయోగించినందుకు లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మొత్తానికైతే నయనతార ప్రేమ విషయం గురించి ధనుష్ మాట్లాడిన మాటలను రాధిక వెల్లడించింది. ఇకపోతే నయనతార జీవిత కథ ఆధారంగా ఈ డాక్యుమెంటరీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నిర్మించిన విషయం తెలిసిందే. నవంబర్ 18వ తేదీన విడుదలైన ఈ డాక్యుమెంటరీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×