BigTV English

TDP MLAs: చంద్రబాబుకి షాక్.. తిరగబడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు

TDP MLAs: చంద్రబాబుకి షాక్.. తిరగబడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు

TDP MLAs: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. క్రికెట్ టీమ్‌లా మిగిలిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. గెలిచిన పదకొండు మంది జగన్ టీమ్ కూడా సభకు హాజరు కావడం లేదు. దాంతో అసెంబ్లీ సమావేశాలు కూల్‌గా సాగిపోతాయని, ఎలాంటి వ్యతిరేక స్వరాలు వినిపించవని, అసంతృప్తులు కనిపించవని అందరూ భావించారు. అయితే టీడీపీ సీనియర్లే అలాంటి వాయిస్ వినిపిస్తూ సభలో వాగ్వాదాలకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సదరు సీనియర్లు నిజంగా ప్రభుత్వ విధానాలు, మంత్రుల వైఖరిని తప్పుపడుతున్నారా? లేకపోతే దాని వెనుక వేరే లెక్కులున్నాయా?


ఏపీ అసెంబ్లీని వైసీపీ బాయ్‌కాట్ చేస్తుంది. అంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ప్రతిపక్షం లేకుండా పోయింది. అయినా సభలో వాగ్వాదాలు చోటు చేసుకుంటుంటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విధానాలను తప్పుపడుతుండటం, మంత్రుల వైఖరిపై స్పీకర్‌కు ఫిర్యాదులు వంటివి వైసీపీకి ఆయుధాలుగా మారే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్‌లు సభాపతి ముందు అసహనం వ్యక్తం చేశారు. జ్యోతుల నెహ్రూ అయితే ఏకంగా డిప్యూటీ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు.

జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సొంత పార్టీపైనే అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అసెంబ్లీలో తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో ఆ సీనియర్ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడం వెనుక ఆ అసంతృప్తే కారణమంటున్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక విధానం గతంలో మాదిరిగా లేదని ప్రభుత్వానికి అంత మంచిది కాదని అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయని చెప్పాలి.


ఇసుక పాలసీపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతుండగా.. త్వరగా ముగించమని డిప్యూటీ స్పీకర్ కోరారు. సభలో మిగిలిన వారికి కూడా అవకాశమివ్వాలని త్వరగా ప్రసంగం ముగించమని పేర్కొన్నారు. దాంతో అసహనం వ్యక్తం చేసిన నెహ్రూ మాట్లాడటానికి మరింత సమయం కావాలని కోరారు. ఆ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో నెహ్రూ సభలో మాట్లాడిన ఎమ్మెల్యేలందరి కంటే తాను సీనియర్‌నని.. అలాంటిది పదేపదే తనను అడ్డుకుంటుంటే తనను ప్రతిపక్షంగా చూస్తున్నట్లు అనిపిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కూర్చోమంటే కూర్చుంటానని, సభకు రావద్దంటే రానని విసుర్లు విసిరారు.

Also Read: గంట టైమ్ ఇస్తాం.. జగన్‌కు కోటం రెడ్డి బంపర్ ఆఫర్

జ్యోతుల నెహ్రూ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతున్న తరుణంలోనే అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ హాట్ కామెంట్స్ చేశారు. జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉందని.. సభ్యులు చెప్పే సమస్యలు రాసుకునే మంత్రి లేరంటూ సొంత వారినే టార్గెట్ చేశారు. రవికుమార్ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు కచ్చితంగా రాసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. అన్ని సమస్యలు రికార్డ్ అవుతాయని అచ్చెన్న ప్రతిపక్షానికి చెప్పుకున్నట్లు చెప్పుకోవాల్సి వచ్చింది.

జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్‌లు అసెంబ్లీకి కొత్త కాదు. ఇద్దరూ సీనియర్లే. కూన రవి 2014-19 మధ్య కాలంలో అసెంబ్లీలో విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలోనే సీనియర్ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వారు స్వపక్షంలో విపక్షంలా ఆయన ఆసహనం వ్యక్తం చేయడంతో దానికి కారణమేంటా? అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు . కూటమి ప్రభుత్వంలో సీనియర్‌ని అయిన తనకు ప్రాధాన్యత దక్కలేదని నెహ్రూ అసంతృప్తితో ఉన్నారంట.

ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించిన ఆయన ఈ సారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే కూటమి ఈక్వేషన్లు, కులసమీకరణలు వంటి కారణాలతో నెహ్రూకి క్యాబినెట్ బెర్త్ దక్కలేదు. ఆయన గత ఎన్నికల్లో నాలుగోసారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ సారి ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో తీవ్రనిరాశకు గురయ్యారంట. మంత్రి పదవి విషయంలో జ్యోతుల నెహ్రూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంట.

ఇక కూనరవి కుమార్ అముదాలవలస నుంచి రెండో సారి గెలిచిన ఆయన వైసీపీ నేత, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారం మేనల్లుడు. మొదటి సారి తమ్మినేనిపై గెలిచినప్పుడు కూన రవికి అసెంబ్లీలో విప్ పదవి ఇచ్చి చంద్రబాబు తగు ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో ఈ సారి గెలిస్తే, అందులోనూ స్పీకర్‌గా పనిచేసిన తమ్మినేనిని ఓడిస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారంట. అయితే కూటమి సమీకరణలు ఆయనకు కూడా కలిసి రాలేదు. ఆ ఫ్రస్టేషన్‌తోనే జ్యోతుల, కూనలు బరస్ట్ అయ్యారన్న చర్చ జరుగుతుంది. మరి ఈ సారి టీడీపీలో చాలా మంద్రి సీనియర్లు కేబినెట్ బెర్త్‌లు దక్కలేదు. ఆ అసంతృప్తితో ఇంకెందరు ఓపెన్ అవుతారో చూడాలి.

 

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×