trinayani serial today Episode: విక్రాంత్ టెన్షన్‌గా డాక్టర్‌కు ఫోన్ చేస్తాడు. డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతలో సుమన వచ్చి ఎవరికి ఫోన్ చేస్తున్నారు అని అడిగితే డాక్టర్‌కు చేస్తున్నాను కానీ ఫోన్ కలవడం లేదని చెప్పగానే సుమన ఆ డాక్టర్ నెంబర్ నాకివ్వండి నేను గట్టిగా కడిగిపారేస్తాను. అన్ని డబ్బులు తీసుకుని మా అక్కను పిచ్చిదాన్ని చేసి ఇంటికి పంపించారు అంటూ తిడుతుంది సుమన. నేను డాక్టర్ ను అదే అడుగుదామంటే ఆమె ఫోన్ కలవడం లేదు అంటాడు విక్రాంత్. అయితే నాకో డౌటు బుల్లిబావగారు అంటూ అసలు వచ్చింది మా అక్క కాదేమో అనిపిస్తుంది నాకు. సడెన్ గా ప్రమాదం జరగడం ఏంటి..? సడెన్ గా గాయాలు నయం కావడం ఏంటి..? అసలు ఇంత స్పీడుగా అన్ని గాయాలు నయం ఎలా ఆవుతాయి. నాకెందుకో మా అక్క చనిపోయి ఆత్మ రూపంలో వచ్చిందేమో అనిపిస్తుంది అని సుమన అనగానే విక్రాంత్ కోపంగా ఇంకొక్క మాట మాట్లాడితే బాగుండదు అంటూ అవును నిజంగా గాయాలు ఎలా మానిపోయాయి. అని ఆలోచిస్తుంటాడు.
నేత్రికి చీర కట్టి హాల్లోకి తీసుకొస్తుంది హాసిని. నయనిని చీరలో చూసిన పావణమూర్తి లేడీ బాస్ ఈజ్ బ్యాక్ అంటాడు. దీంతో బాబాయ్ గారు చాలా సరదాగా మాట్లాడుతున్నారు అంటుంది నేత్రి. దీంతో పావణమూర్తి నయనమ్మ నన్ను గుర్తు పట్టింది అంటూ హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతలో విక్రాంత్ వచ్చి వదిన మీకు అంతా నయం అయిందా..? అని అడుగుతాడు. దీంతో సిగ్గుపడుతూ నేత్రి మీరు నన్ను అప్పుడే వదిన అంటున్నారేంటి..చిన్నబాబు గారు ? అని అడుగుతుంది. ఇంకెప్పుడు వదినా అనాలి అంటూ సుమన అడుగుతుంది. దీంతో నన్ను విశాల్ బాబు గారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ల తమ్ముడు గారు వదినా అంటే బాగుంటుంది కదా అని నేత్రి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
ఇంతలో పావణమూర్తి వామ్మో నయనమ్మ ఏంటి విశాల్ బాబుని మళ్లీ పెళ్లి చేసుకుంటావా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. దీంతో నేత్రి పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్న తర్వాత ముహూర్తాలు పెట్టి పెళ్లి చేయాలి కదా అంటుంది. నేత్రి మాటలకు వల్లభ షాక్ అవుతాడు. ఏంటి మమ్మీ పెద్ద మరదలు ఇలా మాట్లాడుతుంది అని అడుగుతాడు. ఇంతలో తిలొత్తమ్మ ఒక్క నిమిషం ఇటు చూడు నేను ఎవరో గుర్తుందా..? నీకు అని అడుగుతుంది. మిమ్మల్ని నేనెందుకు గుర్తు పెట్టుకోవాలి. అయినా బాబుగారితో పెళ్లి అయితే మిమ్మల్ని అత్తయ్యా అని పిలుస్తాను అంటుంది నేత్రి. నాకిప్పుడు అర్థం అయింది. యాక్సిడెంట్ వల్ల నయనమ్మ కొన్నేళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లు ఉంది అంటాడు పావణమూర్తి. ఇంతలో విక్రాంత్ ఈమె మా వదిన కానట్టు ఉందని మనసులో అనుకుంటాడు.
నేత్రి.. గాయత్రి పాపను చూస్తూ.. ఇంతకీ ఈ పాప ఎవరు? అని అడుగుతుంది. ఈ పాప ఎవరో నీకు తెలియదా..? నీ కూతురు అంటూ వల్లభ చెప్పగానే నేత్రి సీరియస్‌గా వల్లభను చూస్తూ.. ఇదిగోండి మర్యాదగా మాట్లాడితే మంచిది. నాకు ఇంకా పెళ్లే కాలేదు పిల్లల్ని అంటగడతారేంటి అంటూ తిడుతుంది. దీంతో తిలొత్తమ్మ గాయత్రీ నీ కూతురు కాదంటంవా? అని అడుగుతుంటే.. నయని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని విశాల్ అడుగుతాడు. ఇంతలో తిలొత్తమ్మ నువ్వు అన్నట్లు నువ్వు అసలు నయని కాదు. అయితే నువ్వు ఎవరో చెప్పు అంటూ నిలదీస్తుంది. వల్లభ కూడా నువ్వు మా తమ్ముడు భార్య నయనివి కాదు అంటాడు.
తిలొత్తమ్మ, వల్లభ కోపంగా ఎవరు నువ్వు అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంటారు. నేత్రి ఏం చెప్పకుండా అలాగే ఉంటుంది. ఇంతలో గాయత్రి పాప నేత్రి దగ్గరకు వెళ్లానని చేతులు చాపుతుంది. హాసిని పాపను నేత్రికి ఇస్తుంది. యముడి వరం వల్ల (గాయత్రి దేవి కానీ గాయత్రి పాప కానీ తగిలితే నయనికి గతం గుర్తుకు వస్తుంది.) నేత్రి కాస్త నయనిగా మారిపోతుంది. దీంతో గాయత్రి పాపను ప్రేమగా ముద్దాడుతుంది. అందరిని గుర్తు పడుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అసలు నువ్వు నువ్వేనా చెల్లి అని హాసిని అడుగుతుంది. అదేంటి అక్క అలా అంటావ్ అని నయని ఎదురు ప్రశ్నించడంతో వల్లభ భయంగా నువ్వు నయని కాదు కిలాడి అంటాడు. దీంతో వల్లభను తిడుతుంది.
తర్వాత నయని గురించి ఆలోచిస్తూ తిలొత్తమ్మ తల పట్టుకుంటుంది. నయని కావాలనే మనకు పిచ్చి పట్టేలా చేస్తుందా..? అంటూ వల్లభను అడుగుతుంది. దీంతో వల్లభ తిక్క తిక్క సమాధానం చెప్తాడు. మరోవైపు విక్రాంత్ హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ సారిక గారిని కలవాలని నర్స్ ను అడిగితే సారిక మేడం చనిపోయారని చెప్తుంది. విక్రాంత్ షాక్ అవుతాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.