E-Paper
Advertisement

Dhanush SIR Release date: డిసెంబర్ రేసు నుంచి తప్పుకున్న ధనుష్.. ‘సార్’ కొత్త రిలీజ్ డేట్

Dhanush SIR Release date: డిసెంబర్ రేసు నుంచి తప్పుకున్న ధనుష్.. ‘సార్’ కొత్త రిలీజ్ డేట్

కోలీవుడ్‌కి చెందిన విల‌క్ష‌ణ న‌టుడు ధ‌నుష్‌.. త‌న సినిమాల‌తో తెలుగు, హిందీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడిగా మారిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న తొలిసారి చేస్తోన్న స్ట్ర‌యిట్ తెలుగు సినిమా సార్‌. త‌మిళంలో వాత్తీ పేరుతో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ ద్విభాషా చిత్రంలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌తో పాటు ఫార్చ్యూన్ పోర్ సినిమాస్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది ఫిబ్రవ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ధ‌నుష్ సినిమా రిలీజ్ కానుంది. నిజానికి ఈ మూవీని డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని ముందుగా మేకర్స్ భావించారు. అయితే ఇప్ప‌టికే లైన్‌లో చాలా సినిమాలు ఉండ‌టంతో సార్ సినిమాను ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల చేయ‌టానికి నిర్ణ‌యించుకున్నారు.

విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఎత్తి చూపేలా సార్ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే ఆ లోపాల గురించి వెంకీ అట్లూరి ఎంత బ‌లంగా త‌న సినిమా ద్వారా ప్ర‌శ్నించాడ‌నేది సినిమా రిలీజ్ అయిన త‌ర్వాతే తెలియ‌నుంది. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ధ‌నుష్ మ‌రో టాలీవుడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా చేయాల్సి ఉంది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×