BigTV English

Australia: అట్లుంటది.. ఆస్ట్రేలియా ఆటగాళ్లతోని..

Australia: అట్లుంటది.. ఆస్ట్రేలియా ఆటగాళ్లతోని..


ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా టీమ్ స్పెషాలిటీయే వేరు. ఎంత నిబద్ధతతో ఆడతారో.. అంతే నోటి దురుసుతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అడిలైడ్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఇవే సీన్స్ కనిపించాయి. ఒకటి ఓ ఆటగాడి అద్భుత ఆటతీరుకు నిదర్శనమైతే… మరొకటి అదే ఆటగాడి నోటిదురుసుకు అద్దం పట్టింది.

ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ కళ్లు చెదిరే విన్యాసం చేశాడు. బౌండరీ లైన్ దగ్గర అతను క్యాచ్ పట్టి ఉంటే చరిత్రలో నిలిచిపోయేదే కానీ… బంతి మిస్ అయినా అతని ఫీట్ మాత్రం అద్భుతంగా ఉంది. సిక్సర్‌ వెళ్లాల్సిన బంతిని అడ్డుకుని కేవలం ఇంగ్లండ్ కు ఒక్క రన్ మాత్రమే వచ్చేలా చేశాడు… అగర్. సెంచరీ కొట్టాక మరింత ధాటిగా ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్ మలాన్… కమిన్స్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు. బంతి చాలా ఎత్తులో వెళ్లడంతో కచ్చితంగా సిక్సర్ అని అంతా భావించారు. కానీ బౌండరీ లైన్‌ దగ్గర అగర్‌ సూపర్‌మ్యాన్‌లా పైకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. అయితే అప్పటికే బౌండరీ లైన్ అవతల ఉన్నట్లు గమనించి… వెంటనే బంతిని లైన్ అవతలికి విసిరేశాడు. దాంతో… ఆరు పరుగులు వస్తాయనుకున్న చోట ఒక్క పరుగే వచ్చింది. అగర్ ఫీట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


సూపర్ ఫీట్ తో ఔరా అనిపించిన అగర్… కాసేపటికే దురుసు ప్రవర్తనతో అందరితో చివాట్లు తింటున్నాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో పదే పదే పిచ్ మీద తిరుగుతూ ఇంగ్లండ్ బ్యాటర్లను అడ్డుకున్నాడు… అగర్. అతణ్ని గమనించిన ఫీల్డ్‌ అంపైర్‌ పాల్ రీఫెల్… పదే పదే పిచ్‌పై పరిగెత్తడం కరెక్ట్‌ కాదని హెచ్చరించాడు. అంపైర్‌ మాటలు స్టంప్‌ మైక్‌లో రికార్డయ్యాయి. అయితే అగర్ మాత్రం… తాను బంతిని అంచనా వేయడానికి మాత్రమే పరిగెడుతున్నా అని బదులిచ్చాడు. దానికి అంపైర్… బంతిని బ్యాటర్ మిడ్‌ వికెట్‌ వైపు కొడితే… నువ్వు పిచ్‌పైకి ఎందుకు వస్తున్నావు? బ్యాటర్‌ను అడ్డుకోడానికే కదా? అని ప్రశ్నించాడు. దాంతో సీరియస్ అయిన అగర్… అంపైర్‌ వైపు దూసుకెళ్లి అసభ్యకరమైన పదంతో తిట్టాడు. అది కూడా స్టంప్‌ మైక్‌లో రికార్డైంది. ఆ తర్వాత కూడా అగర్‌, అంపైర్ పాల్‌ రీఫెల్‌ మధ్య వాదన కొనసాగింది. దాంతో… అద్భుత ఫీట్ చేసినవాడు ఇలా అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నాడేంటి? అని అనుకున్నారు… మ్యాచ్ చూస్తున్నవాళ్లంతా. ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగిన అగర్‌కు జరిమానా పడే ఛాన్స్ ఉందంటున్నారు.

Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×