BigTV English

Prabhudeva:- ప్రభుదేవాకు మళ్లీ పెళ్లైందా? మూడేళ్లుగా రహస్యంగా ఉంచడమెందుకు?

Prabhudeva:- ప్రభుదేవాకు మళ్లీ పెళ్లైందా? మూడేళ్లుగా రహస్యంగా ఉంచడమెందుకు?


Prabhudeva:- ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకుని చాలాకాలం అయింది. నయనతారతో లవ్ ట్రాక్ కారణంగా మొదటి భార్య రామలతకు విడాకులు ఇచ్చాడు. ఆ సమయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభుదేవాకు విడాకులు ఇచ్చేదే లేదని పట్టుబట్టి కూర్చుంది. తమ సంసారంలో నయనతార నిప్పులు పోసిందంటూ తెగ శాపనార్ధాలు పెట్టింది. మరోవైపు ఇంత రచ్చ జరుగుతున్నా… లండన్‌లో, షూటింగ్ ఏరియాల్లో ప్రభుదేవా-నయనతారల రొమాన్స్ కంటిన్యూ అయింది. రామలత గగ్గోలు పెడుతున్నా సరే… ప్రభుదేవా కోసం మతం మార్చకుంది. తిరుమలకు వచ్చింది. ఇక శ్రీరామరాజ్యం సినిమా తరువాత.. ఇక ప్రభుదేవాతో లైఫ్ షేర్ చేసుకుంటున్నానని, ఇక సినిమాలకు గుడ్ బై అంటూ అందరి కాళ్లు మొక్కి వీడ్కోలు కూడా పలికింది. ఇంతలో ఏమైందో గానీ.. ఇద్దరూ విడిపోయారు.

ప్రభుదేవాతో విడిపోవడం ఆలస్యం నయనతార.. విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. కొంతకాలం రహస్యంగా ఉంచి.. రెండు కుటుంబాలు ఒప్పుకున్నారు అన్న తరువాత రివీల్ చేసింది. నయనతార తన పెళ్లి విషయంలో సీక్రెట్ మెయింటైన్ చేయలేదు. కాని, ప్రభుదేవా మాత్రం ఎందుకనో సీక్రెట్ మెయింటైన్ చేశాడు. పెళ్లి విషయంలో పరువు పోతుందనుకున్నాడో, మళ్లీ గతంలో చేసిన తప్పు చేయడం ఎందుకు అనుకున్నాడో గానీ.. రెండో పెళ్లిని చాలా కాలం సీక్రెట్‌గా ఉంచాడు.


2011లో రామలతతో విడాకులు తీసుకున్న తరువాత.. ప్రభుదేవా హిమానీ సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా కరోనా సమయంలో వీళ్లిదరి పెళ్లి జరిగిపోయింది. ఈ విషయం సన్నిహితులకు తప్ప వేరే వాళ్లకు తెలియలేదు. తమ్ముడు రాజుసుందరం కారణంగానే ప్రభుదేవాకు పెళ్లి అయిందన్న విషయం తెలిసింది. ఆమధ్య ప్రభుదేవా బర్త్ డే రోజున స్పెషల్ వీడియో షేర్ చేసుకున్నారు. ఇందులోనే.. తమ మ్యారేజ్ గురించి రివీల్ చేసింది హిమానీ. ప్రభుదేవాను వివాహం చేసుకోవడం తన అదృష్టం అని చెప్పింది. ఇది జరిగిన కొంత కాలానికే.. ఇద్దరూ తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. స్వామివారి దర్శనం తరువాత బయటికొస్తుండగా మీడియా కంటపడ్డారు. సో, ప్రభుదేవా మళ్లీ పెళ్లిచేసుకున్న విషయం అఫీషియల్‌గా బయటపడింది.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×