Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత (Samantha) మయోసైటిస్ (Myositis)అనే ఆరోగ్య సమస్యతో బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కొన్నాళ్ల క్రితం ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమయింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సమంత గతంలో కూడా ఒక ఆరోగ్య సమస్యతో బాధపడిందట.అప్పుడు తానే డబ్బు సహాయం చేశానని ఒక నిర్మాత కామెంట్లు చేశారు.
సమంతకు ఆర్థిక సహాయం చేసిన నిర్మాత.
ఆయన ఎవరో కాదు ఒకప్పటి స్టార్ నిర్మాత, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas)తండ్రి, బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh). అప్పట్లో ఎన్నో సినిమాలు తీసి భారీ పాపులారిటీ అందుకున్న ఈయన, గత కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 9 ఏళ్ల పాటు విరామం తీసుకున్న ఈయన, ఇప్పుడు మళ్లీ నిర్మాతగా మారి సినిమాలు తీయబోతున్నారు. ఈ సందర్భంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న ఈయన, ఆ ఇంటర్వ్యూలో భాగంగా సమంత గురించి కూడా మాట్లాడారు. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా ‘అల్లుడు శీను’ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రానికి నిర్మాతగా బెల్లంకొండ సురేష్ వ్యవహరించారు. ఆ సమయంలో జరిగిన విషయాన్ని ఆయన తెలిపారు.
సమంత ఎప్పుడూ మా ఇంటి సభ్యురాలే..
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ..”అల్లుడు శీను సమయంలో కూడా సమంతకు ఒక ఆరోగ్య సమస్య ఏర్పడింది. అది చర్మ సమస్యకు సంబంధించింది. అయితే తన ఆరోగ్య సమస్య నుంచి ఆమె బయటపడడానికి డబ్బులు అవసరం అయ్యాయి. కొంతమంది నిర్మాతలకు ఫోన్ చేసినా ఎవరు ఇవ్వలేదు. అప్పుడు నేనే రూ.25 లక్షలు ఆమెకు అప్పుగా ఇచ్చాను. ఆమె బయట ఉంటే ఇబ్బంది అని, సినిమా అయ్యేవరకు స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి మరీ అక్కడ ఉంచాను. నాలుగు నెలల్లో సమంత చర్మవ్యాధి నుంచి కోలుకుంది. ఇక నేను చేసిన సహాయాన్ని సమంత ఎప్పటికీ మర్చిపోదు.. ఇప్పటికే ఆమె మా కుటుంబ సభ్యురాలే ” అంటూ బెల్లంకొండ సురేష్ తెలిపారు దీంతో బెల్లంకొండ సురేష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మయోసైటిస్ కారణంగా ఎన్నో ఇబ్బందులు..
సమంత నాగచైతన్య (Naga Chaitanya)ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.. అదే సమయంలో ఈమె మయోసైటీస్ వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ సమస్య ముదిరిన తర్వాత అందరితో చెప్పుకుంది సమంత. తర్వాత విదేశాలకు కూడా వెళ్లి ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేసింది. ఫలితంగా ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది.ఇక సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో కూడా సమంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని, ఆ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ (Raj)ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఇలా సమంత ఈ వ్యాధి నుంచి దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకొని మళ్లీ పూర్తి ఆరోగ్యంగా జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు.