BigTV English

Pushpa 2: మొత్తానికి ‘పుష్ప 2’ మేకర్స్‌ను కనికరించిన మెగాస్టార్.. మరి బన్నీ ఎక్కడ?

Pushpa 2: మొత్తానికి ‘పుష్ప 2’ మేకర్స్‌ను కనికరించిన మెగాస్టార్.. మరి బన్నీ ఎక్కడ?

Pushpa 2 Makers Meet Chiranjeevi: అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ లభించడం లేదు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా ఏ మెగా హీరో సినిమా రిలీజ్ ఉన్నా కూడా కచ్చితంగా మిగతా మెగా హీరోలు అంతా కలిసి వారికి విష్ చేస్తారు. ప్రమోషన్స్‌లో పాల్గొంటారు. కానీ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ విషయంలో అలా జరగడం లేదు. తను ఒక్కడే ప్రమోషన్స్‌ను చేసుకుంటూ వస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ దగ్గర నుండి కూడా పెద్దగా సపోర్ట్ రావడం లేదు. మొత్తానికి ‘పుష్ప 2’ టీమ్ అంతా కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి ఒప్పించారు. కానీ ఈ మీటింగ్‌లో బన్నీ మాత్రం కనిపించలేదు. దీంతో ఈ విషయం ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.


ఎందుకు రాలేదు?

‘పుష్ప 2’ (Pushpa 2) విడుదల దగ్గర పడుతున్నప్పటి నుండి అసలు మెగాస్టార్ చిరంజీవిని లేదా పవన్ కళ్యాణ్‌ను కలవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వారిద్దరూ ఏదో ఒక కారణం చెప్పి మీటింగ్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. ఫైనల్‌గా మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా ‘పుష్ప 2’ విడుదలయ్యింది. మంచి టాక్ అందుకుంది. దీంతో మేకర్స్‌ను కలవడానికి చిరు ఒప్పుకున్నారు. అందుకే మెగాస్టార్ ఇంటికే వచ్చి కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ‘పుష్ప 2’ మేకర్స్. ఈ మీటింగ్‌కు కేవలం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యేర్నేని, సీఈఓ చెర్రీ వచ్చారు. వీరితో పాటు దర్శకుడు సుకుమార్ కూడా వచ్చారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రాలేదు.


Also Read: ‘పుష్ప 2’లో పుష్ప రాజ్ అన్న కూతురిగా నటించింది ఎవరో తెలుసా?

ఎవరిది తప్పు?

‘పుష్ప 2’ సక్సెస్ అవ్వడం కోసం మెగాస్టార్ బ్లెస్సింగ్ తీసుకోవడానికి మేకర్స్ అంతా వెళ్లినా కూడా అందులో అల్లు అర్జున్ లేకపోవడం ఏంటి అని ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తను నటించిన సినిమాను సపోర్ట్ చేయమని బన్నీనే వచ్చి స్వయంగా అడగాలి కదా, ఎందుకు రాలేదు అని దీని గురించే చర్చలు మొదలుపెట్టారు. అయితే బన్నీని కలవడం చిరంజీవికి ఇష్టం లేదా, లేక చిరంజీవి (Chiranjeevi) బ్లెస్సింగ్స్ తీసుకోవడం అల్లు అర్జున్‌కే ఇష్టం లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలా బన్నీ చేసిన పని వల్ల మరోసారి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ అనే టాపిక్‌పై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

ఒక్కరే సపోర్ట్

అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2’ గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. కానీ మెగా ఫ్యామిలీ నుండి ఒక్క హీరో కూడా దీని గురించి స్పందించలేదు. ఒకప్పుడు సాయి ధరమ్ తేజ్‌కు, అల్లు అర్జున్‌కు మధ్య మనస్పర్థలు వస్తున్నాయని వినిపించినా కూడా సాయి ధరమ్ తేజ్ మాత్రమే ‘పుష్ప 2’కు సపోర్ట్‌గా ట్వీట్ చేశాడు. దానికి బన్నీ కూడా రిప్లై ఇచ్చారు. దీంతో మనస్పర్థలు తొలగిపోయాయేమో అని ఫ్యాన్స్ ఆశించారు. కానీ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లకపోవడంపై మరోసారి దీనిపై హాట్ టాపిక్ మొదలయ్యింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×