Film industry:పోటీ ప్రపంచంలో ఒక్క సినిమా రంగం మాత్రమే కాదు.. ఏ రంగంలో అయినా సరే వ్యక్తుల మధ్య పోటీతత్వం ఉండడం సహజం. వాస్తవానికి అలా పోటీ ఉన్నప్పుడే ఎదుటివారిలోని టాలెంట్ బయటపడుతుంది అని చెబుతారు. ఇక మిగతా రంగాలతో పోల్చుకుంటే ఫిలిం రంగానికి కాస్త గుర్తింపు ఎక్కువ.పైగా అందులో ఉండేది పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతుంది.. ఇక అందులో భాగంగానే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు బయటకు చూడడానికి అందరికీ కనువింపుగా.. అందరితో కలివిడిగా ఉన్నట్టు కనిపించినా.. లోపల మాత్రం పక్క వాళ్ళు బాగుపడితే ఓర్వలేని తత్వం కొంతమందిలో ఉంటుందని ఇప్పటికే నిరూపించారు కూడా..
ఇద్దరు స్టార్ హీరోల మధ్య ముదిరిన వివాదం..
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు మనం హీరోల గురించి, ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఏర్పడిన విభేదాల గురించి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో విన్నాం . కానీ ఆ విభేదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.అయితే ఇక్కడ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఏకంగా డిజిటల్ వార్ మొదలుపెట్టేశారు. పక్కవాడి నష్టానికి సొంత ఖర్చులు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ,ఇద్దరు స్టార్ హీరోలు డిజిటల్ ద్వారా ఒకరికొకరు తక్కువ చేసుకుంటూ ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.ఇద్దరు టాప్ హీరోల మధ్య డిజిటల్ వార్ వల్ల హీట్ పెరుగుతోంది. సోషల్ మీడియా ఫైట్ మరో లెవెల్‌కు చేరిపోయింది. రూ.50-60 లక్షల వరకు ఖర్చు, పెయిడ్ ట్రెండ్స్, స్పాన్సర్డ్ క్యాంపెయిన్స్‌తో నెరేటివ్ కంట్రోల్ పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఫ్యాన్స్ ఫుల్ యాక్షన్ లో వుండగా, న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం ఈ డ్రామా ఎంజాయ్ చేస్తూ మీమ్స్ వేస్తున్నారు!.
వైరల్ గా మారిన డిజిటల్ వార్..
ఏదిఏమైనా ఈ ఇద్దరు హీరోల మధ్య నడుస్తున్న ఈ డిజిటల్ వార్ .. ఒకరకంగా ఇద్దరికీ భారీ నష్టాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. మరి ఈ నష్టాన్ని వారిద్దరు గ్రహించడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య ఇగోలు, ఈర్షలు చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఇద్దరి హీరోల మధ్య మాత్రం ఏకంగా సినిమాలను సైతం విమర్శించేలా నెగెటివిటీ ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు హీరోలు ఎందుకు ఇంతలా ఒకరిపై ఒకరు ఈర్ష పడుతున్నారు. ఈగో పెంచుకుంటున్నారు.. పైగా డిజిటల్ వార్ నిర్వహిస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.ఏదేమైనా ఇలాంటి వాళ్ళు చేసే పనులు ట్రోలర్స్ కి మంచి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది .ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా విషయం దొరకకపోదా అది ఎదురుచూసే ట్రోలర్స్ కి ఇలాంటి హీరోలు చేసే పనులే వారికి విందు భోజనం వడ్డించినంత పని అవుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించి.. ఆ హీరోల మధ్య జరుగుతున్న డిజిటల్ వార్ కి సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి