Ismart Jodi3:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఇస్మార్ట్ జోడీ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని, ఇప్పుడు సీజన్ 3 కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ 3 లో కూడా అందరూ మెచ్చిన , అందరికీ నచ్చిన యాంకర్ ఓంకార్ (Anchor Omkar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లోకి ఏకంగా మొత్తం 9 జంటలు అడుగుపెట్టాయి. అందులో ప్రదీప్ ,- సరస్వతి, రాకేష్ – సుజాత, అనిల్ జీలా – ఆమని, వరుణ్ – సౌజన్య , యష్- సోనియా, మంజునాథ – లాస్య, ఆదిరెడ్డి – కవిత, అమర్దీప్ – తేజు , ప్రేరణ – శ్రీపాద జంటలు ఈ షోలో పాల్గొంటున్నాయి. ఇక యష్ – సోనియా విషయానికొస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకమునుపే.. ఈ షోలోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక యష్ ని పెళ్లి చేసుకున్న ఈమె ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు బిగ్ బాస్ బ్యూటీ ప్రేరణ కూడా తన భర్త శ్రీపాద్ తో కలిసి ఇస్మార్ట్ జోడి లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇస్మార్ట్ జోడి సీజన్ 3 లో ఏ జోడీలు టాప్ లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Hero Vikram: టాలీవుడ్ ని చూసి జలసీ ఫీల్ అవుతున్న విక్రమ్.. ఎందుకంటే..?
ఇస్మార్ట్ జోడి సీజన్ 3 విన్నర్ వారే..
ఇకపోతే ఈ స్మార్ట్ సీజన్ 3 లో మొదటి స్థానంలో అమర్దీప్ – తేజస్విని జంట కొనసాగుతూ ఉండగా.. రెండవ స్థానంలో ప్రేరణ – శ్రీపాద్ ఉన్నారు. ఇక కవిత – ఆదిరెడ్డి మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా.. టాప్ ఫోర్లో సోనియా – యష్ కొనసాగుతూ ఉండడం గమనార్హం . ఇకపోతే ఇప్పటివరకు లీడ్ లో ఉన్న అమర్దీప్ తేజస్విని జంట ఇస్మార్ట్ జోడి అవుతుందని అందరూ అనుకుంటున్నారు. మరి ఎప్పుడైనా పరిస్థితులు తారుమారు కావచ్చు. కాబట్టి ఏ జంట ఇస్మార్ట్ జోడి అవుతుందో చూడాలి అంటూ అభిమానులు సైతం ఈ షో ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ప్రతి శని, ఆదివారాలలో రాత్రి తొమ్మిది గంటలకు టెలికాస్ట్ చూసే.. వీక్షకులు మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్ 3 ఇస్మార్ట్ జోడి అమర్దీప్ – తేజూనే అంటుంటే మరికొంతమంది మాత్రం ప్రేరణ – శ్రీపాద్ బరిలో దిగుతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ రెండు జంటలు పోటీ పడుతున్నాయి. మరి ఈ రెండు జంటలలో అమర్దీప్ – తేజస్విని ఇస్మార్ట్ జోడిగా నిలుస్తారా లేక ప్రేరణ – శ్రీపాద్ టైటిల్ విన్నర్ అవుతారా అన్నది తెలియాల్సి ఉంది.
ఓంకార్ కెరియర్..
ఇక ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న యాంకర్ విషయానికి వస్తే.. యాంకర్ ఓంకార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మొదట ఒక ప్రముఖ మ్యూజిక్ ఛానల్ లో అంకితం అనే మ్యూజిక్ షో ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన ఈయన ఆ తర్వాత మాయాద్వీపం అనే కార్యక్రమానికి కూడా యాంకర్ గా చేశారు. ఇక టెలివిజన్ కార్యక్రమాలలో పనిచేసినందుకుగాను భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఓంకార్.. రాజు గారి గది 3 సినిమాకు దర్శకత్వం కూడా వహించారుm ఇక ఈయన సోదరుడు అశ్విన్ బాబు కూడా తెలుగు సినిమా నటుడే కావడం గమనార్హం. ఓంకార్ 2011లో స్వరూప ను వివాహం చేసుకోగా.. ఒక సంతానం కలిగి ఉన్నారు.