నేడు హైదరాబాద్ – రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్:
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ సీజన్ రెండవ రోజు హైదరాబాద్ లో మరో సూపర్ మ్యాచ్ జరగబోతోంది. రాజస్థాన్ రాయల్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సన్రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ లో అత్యధిక పరుగులు చేసి రికార్డులను సృష్టించింది.
Also Read: David Warner: ఎయిర్ ఇండియాతో వార్నర్ కు గొడవ..!
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా బలంగా ఉంది. ఇలా రెండు జట్లు బలంగా ఉండడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. అయితే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గణాంకాలు మాత్రం సన్రైజర్స్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటివరకు ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఆరు మ్యాచ్ లలో ఐదింటిలో సన్ రైజర్స్ గెలుపొందింది. రాజస్థాన్ తో తలపడిన మూడు మ్యాచ్లలోనూ సన్రైజర్స్ గెలుపొందింది. గత సీజన్ లో హైదరాబాద్ జట్టు పరుగుల వరద పారించింది.
లీగ్ చరిత్రలోనే మూడుసార్లు రికార్డు హైయెస్ట్ స్కోర్ నమోదు చేసిందంటే.. హైదరాబాద్ జట్టు ఏ విధంగా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. కానీ త్రుటిలో టైటిల్ కోల్పోయింది సన్రైజర్స్. ఇక ఈసారి ఎలాగైనా టైటిల్ కైవసం చేసుకోవాలనే పంతంతో ఉంది. ఇక రాజస్థాన్ కూడా యశస్వి జైస్వాల్, సంజూ, నితీష్ రానా, రియాన్ పరాగ్, హిట్ మేయర్ రూపంలో బలమైన బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉంది. ఈ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మఫ్టీ లో షీ టీమ్స్:
ఈరోజు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం మఫ్టిలో షీ టీమ్స్ ఉంటాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 450 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Also Read: RCB- Mallya: RCB ఫస్ట్ విక్టరీ… విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు!
ఇక స్టేడియం లోకి ల్యాప్టాప్ లు, బ్యానర్లు, వాటర్ బాటిల్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు, లైటర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, సెంట్స్, బ్యాగులు, బయటి ఆహార పదార్థాలను అనుమతించమని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రేక్షకులు తిరిగి వారి స్థలాలకు వెళ్లడానికి ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా రైళ్లను ఆలస్యంగా నడపాలని మెట్రోను అభ్యర్థించామని తెలిపారు సుదీర్ బాబు. ఈ మ్యాచ్ లో తమ అభిమాన జట్టు గెలుపొందాలని ఇటు హైదరాబాద్ అభిమానులు, అటు రాజస్థాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాలి.