Jr NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ఎన్టీఆర్ (Jr.Ntr)ఒకరు. సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు మనవడిగా, హరికృష్ణ కుమారుడిగా అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ తాజాగా వార్ 2 సినిమా(War 2 Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా నందమూరి నట వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి హీరోగా రాకముందు బాలనటుడిగా కూడా నటించారు.
భక్త మార్కండేయ సీరియల్…
ఇక ఎన్టీఆర్ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ నటించిన ఆ సీరియల్ ఏంటి అనే విషయానికి.. ఈటీవీ ప్రారంభించిన మొదట్లో భక్త మార్కండేయ (Baktha Markandeya)అనే ధారావాహికను ప్రారంభించారు. ఇక ఈ సీరియల్ లో ఎన్టీఆర్ బాల నటుడిగా(Child Artist) నటించి మెప్పించారు. ఈ సీరియల్ ప్రసారమైనది కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే అయినప్పటికీ ఎన్టీఆర్ నటన మాత్రం అప్పట్లో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుందని చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ లుక్ కు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాల నటుడిగా మెప్పించిన ఎన్టీఆర్..
ఇలా ఈయన బాలనటుడిగా వెండి తెరపై మాత్రమే కాదు బుల్లితెరపై కూడా నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ కు చిన్నప్పటినుంచి తన తల్లి శాలిని భరతనాట్యం కూచిపూడి నేర్పించడంతో ఈయన చిన్న వయసులోనే పలు స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా చిన్నతనం నుంచి డాన్స్, నటనపై ఎంతో ఆసక్తి ఉన్న ఎన్టీఆర్ అతి చిన్న వయసులోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక కెరియర్ మొదట్లో హీరోగా ఎన్టీఆర్ నటించిన సినిమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా..
ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాతిక సంవత్సరాలు పూర్తి అయ్యాయని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న తారక్ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసిన వార్సి 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతోపాటు దేవర 2, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఇలా ఎన్టీఆర్ వెండితెరపై బుల్లితెరపై నటుడిగా ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా హోస్ట్ గా కూడా తన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఈయన బిగ్ బాస్ కార్యక్రమం తో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి కూడా హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Also Read: Actress: డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దులు పెడుతూనే ఉన్న హీరోయిన్, పెళ్లయినా ఇదేం పాడుబుద్ధి