BigTV English

Jailer 2 : హైదరాబాదులో రజనీకాంత్, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే?

Jailer 2 : హైదరాబాదులో రజనీకాంత్, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే?

Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్ తో పని చేసిన రజినీకాంత్ ఇప్పుడు యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి జైలర్ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. అందుకే సినిమాకి వచ్చిన ఆడియన్స్ కి ఆ సినిమా విపరీతంగా నచ్చింది.


కోలమావు కోకిల సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నెల్సన్ దిలీప్ కుమార్. నయనతార నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన వరుణ్ డాక్టర్ సినిమా మంచి సక్సెస్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. రెండు వరుస సక్సెస్ఫుల్ సినిమాలు తర్వాత ఆ దర్శకుడు నుంచి ఇంకో సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. అయితే విజయ్ హీరోగా చేసిన బీస్ట్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

హైదరాబాదులో తలైవా 


రీసెంట్ గా కూలీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు రజినీకాంత్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హైదరాబాదులో పలుచోట్ల ఈ సినిమాకి టికెట్ దొరకని పరిస్థితి. అయితే అక్కడక్కడ సినిమా గురించి మిక్సిడ్ టాక్ కూడా వినిపిస్తుంది. కానీ సినిమా గురించి నెగిటివ్ టాక్ మాత్రం ఎక్కడా వినిపించలేదు. ఇక ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ జైలర్ 2 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. రజనీకాంత్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు.

భారీ అంచనాలు

బీస్ట్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత జైలర్ సినిమా వచ్చింది కాబట్టి పెద్దగా అంచనాలు ఎవరికి లేవు. కానీ థియేటర్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డీల్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రజనీకాంత్ ని ఆడియన్స్ ఎలా చూడడానికి ఇష్టపడతారు అలా చూపించి మంచి కిక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం వస్తున్న జైలర్ 2 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే జైలర్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే,ఇప్పుడు దాన్ని మించి జైలర్ 2 ఖచ్చితంగా ఉండాలి. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ సాధించింది.

Also Read: Akhanda 2: అఖండ 2 లో ‘గంజాయి’… బాలయ్య నుంచి మరో మెసేజ్

Related News

Akhanda 2: అఖండ 2 లో ‘గంజాయి’… బాలయ్య నుంచి మరో మెసేజ్

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాదండోయ్.. సీరియల్ కూడా చేశారని తెలుసా.. ఏదంటే?

Actress: డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దులు పెడుతూనే ఉన్న హీరోయిన్, పెళ్లయినా ఇదేం పాడుబుద్ధి

Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. విజయ్‌ ఫొటోలతో రష్మిక అలాంటి కామెంట్స్, దాచినా దాగవులే!

Balakrishna: రైట్ .. రైట్..ఆర్టీసీ డ్రైవర్ గా మారిన బాలయ్య..వీడియో వైరల్!

Big Stories

×