BigTV English

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి..

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి..

క్రెడిట్ స్కోర్ అనేది మీరు తీసుకునే లోన్స్ తిరిగి చెల్లింపులు వంటి ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. సాధారణంగా క్రెడిట్ స్కోర్ అనేది మనకు తెలిసిన ప్రకారం సిబిల్ అనే సంస్థ అందజేస్తుంది. పలు బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు సైతం సిబిల్ సంస్థ అందజేసిన క్రెడిట్ స్కోరునే ప్రామాణికంగా ఎక్కువగా భావిస్తుంటాయి. అయితే సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. సాధారణంగా బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు లోన్ అప్లై చేసిన కస్టమర్ల సిబిల్ చెక్ చేస్తూ ఉంటారు. దీనికోసం అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజులో సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి చాట్ చేసి కూడా ఉంటాయి. అయితే సిబిల్ స్కోర్ తరచూ చెక్ చేసుకున్నట్లయితే మీకు క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందని కూడా నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా సిబిల్ స్కోర్ అనేది 300 పాయింట్ల నుంచి 900 పాయింట్ల మధ్యలో ఉంటుంది. లోన్ కోసం అప్లై చేసుకున్న దరఖాస్తుదారు సిబిల్ స్కోర్ 750 పాయింట్లు ఉన్నట్లయితే లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే తక్కువ వడ్డీ రేటుకు రుణం లభిస్తుంది


అయితే ప్రస్తుత కాలంలో క్రెడిట్ స్కోర్ అనేది కేవలం బ్యాంకు లోన్ అప్లై చేసుకోవడం కోసం మాత్రమే కాదు. అనేక సందర్భాల్లో ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఒక ప్రామాణికంగా మారిపోతోంది. ముఖ్యంగా అద్దెకు ఇల్లు తీసుకునేటప్పుడు కూడా క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తున్నారు. దీంతోపాటు ఇటీవల ఉద్యోగ నియామకాల్లో కూడా ఇంటర్వ్యూలలో క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక యువకుడికి క్రెడిట్ కోడ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో అతడి వివాహం కూడా మధ్యలో నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిబట్టి క్రెడిట్ స్కోర్ కోసం ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

అయితే క్రెడిట్ స్కోర్ కోసం తరచూ డబ్బులు చెల్లించడం అనేది కష్టమైన పనిగా చెప్పవచ్చు. అయితే కొన్ని సంస్థలు ఆర్బిఐ ద్వారా అప్రూవల్ పొంది ఉచితంగా క్రెడిట్ స్కోర్ ను అందిస్తున్నాయి. వీటిలో ఎక్స్‌పీరియన్ (Experian), ఈక్విఫాక్స్ (Equifax) హైమార్క్ (High Mark) ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. అలాగే సిబిల్ సంస్థ కూడా ఇటీవల క్రెడిట్ స్కోరు కొన్ని పేమెంట్ యాప్స్ తో కలిసి ఉచితంగా చూసుకునేందుకు అనుమతిస్తోంది. ముఖ్యంగా సిబిల్ సంస్థ గూగుల్ పే యాప్ ద్వారా క్రెడిట్ కార్డు చూసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.


ఉచితంగా క్రెడిట్ స్కోర్ చూసుకోవాలి అంటే పలు ఫైనాన్షియల్ టెక్నాలజీ యాప్స్, అలాగే వెబ్ సైట్స్ కూడా క్రెడిట్ స్కోర్ చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా పేటీఎం (Paytm), క్రెడ్ (CRED), బ్యాంక్‌బజార్ (BankBazaar) ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. సాధారణంగా క్రెడిట్ స్కోర్ చూసుకునేందుకు మీ పాన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ముఖ్యమైనవి. మీ క్రెడిట్ స్కోర్ ను బట్టి కొన్ని సంస్థలు మీకు క్రెడిట్ కార్డులను సైతం సిఫార్సు చేస్తుంటాయి. అలాగే ఇతర లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని సమాచారం అందిస్తుంటాయి. ఇలా ఉచితంగా మీరు క్రెడిట్ స్కోరు చెక్ చేసుకునే అవకాశం ఉంది.

Related News

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

ఇకపై టోల్ గేట్ అడ్డంకులు లేవు…నేటి నుంచి ఫాస్టాగ్ పాస్ అమలు..ఇలా రీచార్జ్ చేయించుకోండి..

Scheme for women: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ – వడ్డీ లేకుండా 5 లక్షల రుణం

PM Modi On Gst: ఎర్రకోట నుంచి సామాన్యులకు మోదీ శుభవార్త .. దీపావళి గిఫ్ట్, పన్ను రేట్ల తగ్గింపు

Big Stories

×