BigTV English

Akhanda 2: అఖండ 2 లో ‘గంజాయి’… బాలయ్య నుంచి మరో మెసేజ్

Akhanda 2: అఖండ 2 లో ‘గంజాయి’… బాలయ్య నుంచి మరో మెసేజ్

Akhanda 2: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా కూడా బోయపాటి శ్రీను బాలకృష్ణ అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఎందుకంటే బాలకృష్ణకు వరుస డిజాస్టర్లు వస్తున్న టైం లో, సింహ అనే సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.


రెండు సూపర్ హిట్ సినిమాలు తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా అఖండ. అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విపరీతమైన సక్సెస్ సాధించింది. దీనికి కారణం బాలకృష్ణ చేసిన అన్స్టాపబుల్ అనే షో అని కూడా చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ సినిమా ఎంత బాగున్నా కూడా కొంతమంది ట్రోల్ చేయటం అనేది ఎప్పటినుంచో జరుగుతుంది. ఆ షో బాలకృష్ణ మిగతా హీరోలతో మాట్లాడే విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. బాలయ్య అసలైన వ్యక్తిత్వం ఏమిటో అందరికీ తెలిసింది. అక్కడి నుంచి బాలకృష్ణను విపరీతంగా చాలామంది ప్రేమించడం మొదలుపెట్టారు.

అఖండ 2 లో ‘గంజాయి


బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ప్రస్తుతం అఖండ 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా మంచి సక్సెస్ సాధించడం. అయితే అఖండ 2 సినిమాలో గంజాయి కి సంబంధించి ఒక మెసేజ్ ఉండబోతుంది. అంతేకాకుండా ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా బోయపాటి శ్రీను ప్లాన్ చేశాడట. బోయపాటి శ్రీను యాక్షన్ ని ఎలా చూపిస్తాడు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బాలయ్య అంటే ఇంకో రేంజ్ కి వెళ్ళిపోతాడు. ఈసారి అఖండ 2 లో కూడా అదే జరగబోతుంది.

పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ 

సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతోపాటు అఖండ 2 కూడా అదే రోజు విడుదలవుతుంది అని అనౌన్స్ చేశారు. అయితే ఈ రెండింటిలో ఒక సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఓ జి అయితే వస్తుంది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అఖండ 2 సినిమాకి సంబంధించి సీజీ వర్క్ ఇంకా పూర్తి కావలసి ఉంది. ఈ సినిమా కొత్త డేట్ ను అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Also Read: Rashmika Mandanna:నమ్మలేకపోతున్నా.. విజయ్‌ ఫొటోలతో రష్మిక అలాంటి కామెంట్స్, దాచినా దాగవులే!

Related News

Jailer 2 : హైదరాబాదులో రజనీకాంత్, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే?

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాదండోయ్.. సీరియల్ కూడా చేశారని తెలుసా.. ఏదంటే?

Actress: డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దులు పెడుతూనే ఉన్న హీరోయిన్, పెళ్లయినా ఇదేం పాడుబుద్ధి

Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. విజయ్‌ ఫొటోలతో రష్మిక అలాంటి కామెంట్స్, దాచినా దాగవులే!

Balakrishna: రైట్ .. రైట్..ఆర్టీసీ డ్రైవర్ గా మారిన బాలయ్య..వీడియో వైరల్!

Big Stories

×