BigTV English

Maharashtra MLC Elections| వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయాలు.. హోటల్ గదుల్లో ఎమ్మెల్యేలు ఖైదు!

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. త్వరలో జరగబోయే 11 ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు చేయడంలో బిజీగా మారాయి. ఈ క్రమంలో మరోసారి తెరపైకి హోటల్ పాలిటిక్స్ మొదలయ్యాయి.

Maharashtra MLC Elections| వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయాలు.. హోటల్ గదుల్లో ఎమ్మెల్యేలు ఖైదు!

Maharashtra MLC Elections(Today’s news in telugu): మహారాష్ట్ర రారాజకీయాలు మరోసారి వేడెక్కాయి. త్వరలో జరగబోయే 11 ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు చేయడంలో బిజీగా మారాయి. ఈ క్రమంలో మరోసారి తెరపైకి హోటల్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ ఎమ్మెల్యేలు బాంద్రా ప్రాంతంలోని తాజ్ ల్యాండ్స్ హోటల్ లో అత్యవసరంగా సమావేశమయ్యారు. స్థానిక మీడియా సమాచారం మేరకు.. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్.. బిజేపీ, అజిత్ పవార్ ఎన్ సీపీ తో పొత్తు వ్యవహారాలు, సీట్ల సర్దుబాటు విషయాలపై చర్చించారు.


మరోవైపు ఎన్ సీపీ ఎమ్మెల్యేలు కూడా అంధేరి ప్రాంతంలోని లలిత్ హోటల్ లో అత్యవసర మీటింగ్ లో పాల్గొన్నారు. బుధవారం అర్ధరాత్రి లలిత్ హోటల్ లో ఒక ఎమ్మెల్యే జన్మదిన కార్యక్రమాల ముసుగులో రహస్య మీటింగ్ జరుగింది. ముంబైలో వర్షాలు కురుస్తున్నా.. లలిత్ హోటల్ లో ఈ రోజు కూడా మరోసారి ఎన్ సీపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు.

Also Read:  జైలులో నటుడు దర్శన్‌కు కష్టాలు, పవిత్రగౌడ కంటతడి..


ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎమ్మెల్యేలు మరో హోటల్ లో
మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్షమైన ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఐటీసీ గ్రాండ్ మరాఠా హోటల్ లో మీటింగ్ చేశారు. వీరిలో కొంతమంది నిన్నరాత్రి నుంచి హోటల్ గదుల్లోనే ఉండగా.. మరికొందరు ఈ రోజు హోటల్ మీటింగ్ కు రానున్నారని సమాచారం. మరోవైపు బిజేపీ కూడా ఎన్నికల టెన్షన్ లో ఉంది. బిజేపీ ఎమ్మెల్యేలు కూడా తాజ్ ప్రెసిడెన్సీ హోటల్ లో గురువారం ఉదయం పది గంటలకు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఢిల్లీ బిజేపీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయని.. ఎన్నికల కోసం పనిచేసేందుకు మార్గదర్శకాలు జారీ చేశారని సమాచారం.

Also Read: నీట్‌ పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌‌పై కేంద్రం అఫిడవిట్..సుప్రీంకోర్టులో విచారణ!

మహారాష్ట్రలో జూలై 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, అజిత్ పవార్ ఎన్ సీపీ ఎమ్మెల్యేలు క్రాస్ వోటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని ముందే సమాచారం రావడంతో ఈ సమావేశాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

 

Tags

Related News

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Big Stories

×