BigTV English

ఇకపై టోల్ గేట్ అడ్డంకులు లేవు…నేటి నుంచి ఫాస్టాగ్ పాస్ అమలు..ఇలా రీచార్జ్ చేయించుకోండి..

ఇకపై టోల్ గేట్ అడ్డంకులు లేవు…నేటి నుంచి ఫాస్టాగ్ పాస్ అమలు..ఇలా రీచార్జ్ చేయించుకోండి..

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫాస్టాగ్ పాస్ సిస్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ స్కీం కింద తరచుగా హైవేల మీద ప్రయాణించేవారు 3000 రూపాయలు చెల్లించి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆ తర్వాత సంవత్సరం పాటు హైవే పైన టోల్ గేట్ల వద్ద ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఫాస్టాగ్ విధానంలో ప్రతి టోల్గేట్ వద్ద మీరు ప్రీపెయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా టోల్గేట్ వద్ద డబ్బులు మీ ఆన్ లైన్లో కట్ అవుతూ ఉంటాయి. అయితే దీనివల్ల తరచుగా హైవే పైన ప్రయాణించే వారికి ఇది ఆర్థికంగా భారం అని చెప్పవచ్చు. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా NHAI (National Highways Authority of India) కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సంవత్సరం పాటు హైవేలపైన ఇలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించేందుకు ప్రైవేట్ వాహనాల కోసం ఫాస్టాగ్ పాస్ విధానం ప్రవేశపెట్టారు.


ఫాస్టాగ్ పాస్ ఎలా పనిచేస్తుంది.
>> సాధారణంగా ఈపాస్ ఉపయోగించి సంవత్సరం పాటు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే దీనికోసం 3000 రూపాయలతో వార్షిక పాస్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
>> అయితే ఇక్కడ ఒక నిబంధనం ఉంది. దీని ప్రకారం 200 టోల్ ఫ్రీ ప్రయాణాలు లేదా ఒక సంవత్సరం పాటు ఉచిత టోల్ రెండింటిలో ఏది ముందుగా ఆ నిబంధన పూర్తయితే అది వర్తిస్తుందన్న సంగతి గుర్తుంచుకోవాలి.
>> ఉదాహరణకు 200 టోల్ ఫ్రీ ప్రయాణాలు పూర్తి చేసినట్లయితే ఏడాది పూర్తముందే మీ వార్షిక పాస్ వ్యాలిడిటీ తీరిపోతుంది. లేదా మీరు సంవత్సరంలోగా 200 టోల్ ఫ్రీ ప్రయాణాలు వాడుకోకపోతే, అప్పుడు కూడా సంవత్సరం పూర్తయ్యే నాటికి వార్షిక పాస్ వ్యాలిడిటీ గడువు తీరిపోతుంది.

ఫాస్టాగ్ పాస్ ఎలా పొందాలి
>> ముందుగా NHAI ఫాస్టాగ్ పోర్టల్‌లో ఆన్ లైన్ ద్వారా ఓపెన్ చేయాలి.
>> ఇప్పుడు ఆ పోర్టల్ లో Monthly Pass లేదా Yearly Pass ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. .
>> ఇప్పుడు ఆ వెబ్ పేజీలో మీ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఫాస్టాగ్ వివరాలు నమోదు చేయాలి.
>> ఇప్పుడు పేమెంట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.
>> పాస్ జారీ అయిన తర్వాత, అది మీ ఫాస్టాగ్ ఖాతాకు లింక్ అవుతుంది.


వార్షిక పాస్ వల్ల ప్రయోజనాలు ఇవే:
ఫాస్టాగ్ వార్షిక పాస్ వల్ల తరచుగా హైవే పైన ప్రయాణించే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు సంవత్సరానికి రూ.10,000 ఫాస్టాగ్ రీఛార్జ్ ద్వారా ఖర్చయ్య వారికి, ఈ వార్షిక పాస్ తీసుకోవడం ద్వారా కేవలం 3000 రూపాయల ఖర్చవుతుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే ఈ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అనేది కేవలం ప్రైవేట్ కార్లు, వ్యాన్, జీపులకు మాత్రమే వర్తిస్తుంది. అదే సమయంలో క్యాబ్స్, ఇతర కమర్షియల్ వాహనాలకు వర్తించదు.

Related News

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి..

Scheme for women: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ – వడ్డీ లేకుండా 5 లక్షల రుణం

PM Modi On Gst: ఎర్రకోట నుంచి సామాన్యులకు మోదీ శుభవార్త .. దీపావళి గిఫ్ట్, పన్ను రేట్ల తగ్గింపు

Big Stories

×