Asia Cup winners : ఆసియా కప్ 2025 టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. యూఏఈ వేదికగా మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో జరగనున్నాయి. అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్ తన మొదటి మ్యాచ్ ని సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆసియా కప్ కోసం భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆగస్టు 19 లేదా 20న ప్రకటించే అవకాశముంది. తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో భారత్ జట్టులో ఎవరుంటారా? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జపాన్ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు టీమిండియా ఆసియా కప్ ను 8 సార్లు గెలుచుకొని టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
Also Read : Asia Cup 2025 : సూర్య కుమార్ యాదవ్ లేకుండానే టీమిండియా జట్టు…?
టీమిండియా తరువాత శ్రీలంక జట్టు 6 సార్లు, పాకిస్తాన్ జట్టు 2 సార్లు గెలుచుకుంది. టీమిండియా విషయానికి వస్తే.. తొలిసారిగా 1984లో ఆసియా కప్ గెలుచుకుంది. ఇక ఆ తరువాత 1988, 1990, 1995, 2010, 2016, 2018, 2023 మొత్తం టీమిండియా 8 సార్లు ఆసియా కప్ విన్ అయింది. శ్రీలంక విషయానికి వస్తే.. 1986, 1987, 2004, 2008, 2014, 2022లో మొత్తం శ్రీలంక జట్టు 6 సార్లు ఆసియా కప్ కొట్టింది. పాకిస్తాన్ జట్టు 2000, 2012లో ఆసియా కప్ గెలుచుకుంది. ఇప్పుడు ఈ సారి ఎవ్వరూ గెలుస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారనుంది. ఇక ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ జట్టు ప్రకటన కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 09 నుంచి 28 వరు యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ లో టీ-20 ఫార్మాట్ లో జరుగనుంది.
ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించనున్నారు. ఆగస్టు 20న ముంబైలో సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాల్గొంటారు. అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్క్వాడ్ వివరాలను వెల్లడిస్తారు. ప్రస్తుతం కొంత మంది ఆటగాళ్లు బెంగళూరులోని ఎన్సీఏలో ఫిట్ నెస్ టెస్టుల్లో పాల్గొంటున్నారు. వీరి విషయంలో క్లారిటీ వచ్చిన వెంటనే జట్టు ప్రకటన ఉంటుందని సమాచారం. ఆసియా కప్ 2025 భారత జట్టుకు చాలా ముఖ్యమైన టోర్నమెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే..? ఇది 2026 టీ-20 వరల్డ్ కప్ సన్నాహకంగా ఉంటుంది. ఈ టోర్నమెంట్ యూఏఈలోని దుబాయ్, అబుదాబిలో జరుగనుంది. గ్రూపు-ఏ లో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ లత తలపడనుంది. భారత్ తమ ప్రచారాన్ని సెప్టెంబర్ 10న యూఏఈలో మ్యాచ్ తో ప్రారంభిస్తుంది. ఆ తరువాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో మై వోల్టేజీ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు శుబ్ మన్ గిల్ టీమిండియా తరపున టీ-20ల్లో పునరాగమనం చేయనున్నట్టు సమాచారం.