BigTV English

Ravi Teja – Mr. Bachchan: మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. తీవ్ర మెడ నొప్పితో రవితేజ.. ఫొటో వైరల్

Ravi Teja – Mr. Bachchan: మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. తీవ్ర మెడ నొప్పితో రవితేజ.. ఫొటో వైరల్

Ravi Teja Harish Shankar movie update(Today tollywood news): మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. అయినా ఆశించిన ఫలితం అందుకోలేకపోతున్నాడు. గతేడాది ఒకటి రెండు సినిమాలతో వచ్చినా.. పెద్దగా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఈ ఏడాది అయినా మంచి హిట్ కొడదాం అని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ మూవీ చేశాడు.


ఫస్ట్ నుంచి ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌తో సినిమా రేంజ్ ఓ స్థాయిలోకి చేరింది. అదే జోష్‌లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ అందుకుని అందరి అంచనాలను తలకిందులు చేసింది. అయినా రవితేజ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. భారీ హిట్టు కొట్టి తన అభిమానులకు ట్రీట్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు.

క్రియేటివ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చేస్తున్నాడు. ప్రముఖ టాలీవుడ్ బడా బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రశాద్ గ్రాండ్‌ లెవెల్లో నిర్మిస్తున్నారు. అలాగే వివేక్ కూచిబొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ అయిన ‘రైడ్’కు రీమేక్‌గా వస్తుంది.


Also Read: యూపీలో ‘మిస్టర్ బచ్చన్’ షెడ్యూల్ పూర్తి.. అయోధ్య రామున్ని ద‌ర్శించుకున్న దర్శకుడు!

ఈ మూవీలో రవితేజకు జోడీగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజా షెడ్యూల్‌లో మాస్ మహారాజా పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రవితేజ ఫ్యాన్స్ ఓ బ్యాడ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘మిస్టర్ బచ్చన్’ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్‌గా మారడంతో సినీ ప్రేక్షకులు, అభిమానులు కంగారుపడుతున్నారు. తాజాగా రవితేజ ఫొటోను షేర్ చేశాడు హరీష్ శంకర్.

అందులో రవితేజ తీవ్రమైన మెడనొప్పితో భాదపడుతున్న సమయంలో చల్లటి ఐస్ క్యూబ్‌ని పట్టుకుని కనిపించాడు. దీనికి క్యాప్షన్ ఇస్తూ.. ‘‘మాస్ మహారాజా రవితేజ డేడికేషన్‌కు హ్యాట్సాఫ్. తీవ్ర మెడనొప్పి ఉన్నా.. షూటింగ్‌లో పాల్గొంటున్నారు. థ్యాంక్యూ అన్నయ్య..’’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై కొందరు అభిమానులు కంగారు పడుతుంటే.. మరికొందరేమో జాగ్రత్త అన్నయ్య అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×