BigTV English

Beauty Tips: కొరియన్ల మాదిరిగా మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటున్నారా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..

Beauty Tips: కొరియన్ల మాదిరిగా మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటున్నారా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..

Beauty Tips Dont Use any Products For Beauty Try These Simple Natural Tips: ఈరోజుల్లో అమ్మాయిలు అందంగా ఉండాలి.. ఆకర్షణీయంగా ఉండాలని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లు, మార్కెట్ లో దొరికే ఫేస్ ప్యాక్ లు వాడుతుంటారు. బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి అందం కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఇక నుంచి మీరు పార్లర్‌కి వెళ్లి మీ చర్మానికి మెరుపును పెంచుకోవడానికి ఖరీదైన కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌పై డబ్బు పెట్టాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చొని కొరియన్స్ లాగా మెరిసే చర్మాన్ని ఈజీగా పొందవచ్చు. అదెలా అనుకుంటున్నారా.. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు.


ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

ఈ సహజమైన ఫేస్ ప్యాక్‌ను ఇంట్లో తయారు చేయడానికి బియ్యం నీరు, పసుపు, శెనగపిండి వంటి పదార్థాలు అవసరం. ముందుగా మీరు ఒక గిన్నెలో బియ్యం నీటిని తీసుకొని వాటిలో కాస్త శనగపిండి వేయాలి. చర్మం మెరుపు కోసం ఈ నీటిలో చిటికెడు పసుపును కూడా వేయాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి కొంచెంసేపు పక్కన ఉంచాలి. కొంత సమయం తర్వాత ఈ నేచురల్ ఫేస్ ప్యాక్‌ని మీ ముఖంపై అలాగే మీ మెడ చుట్టూ పూర్తిగా అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖంపై అరగంట పాటు ఉంచండి. కేవలం కొన్ని వారాల్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది.


Also Read: పీరియడ్స్ టైంలో మహిళలు బ్లడ్ డొనేట్ చేయవచ్చా ?

వాస్తవానికి, బియ్యం నీరు, శెనగపిండి, పసుపులో ఉండే మూలకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు మాత్రమే అప్లై చేయాలి. వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ ఉపయోగించడం వల్ల మీ చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

Related News

Food: ఖాళీ కడపుతో.. పొరపాటున కూడా ఇవి తినొద్దు తెలుసా ?

Cancer Risk: వంటగదిలో ఉన్న ఈ ఆహార పదార్థాలతో.. క్యాన్సర్‌కు చెక్

Ritika Nayak: జోరు పెంచిన మిరాయ్ బ్యూటీ.. ఘనంగా స్టోర్ లాంఛ్

Hand Dryer: పరిశుభ్రత పేరుతో అనారోగ్యం.. వామ్మో ఇంత డేంజరా ?

Diabetes health Tips: డయాబెటిస్‌కు సులువైన పరిష్కారం.. ఈ పండు ఆకు నీటిని తాగితే చాలు!

Walking: డైలీ 20 నిమిషాలు నడిస్తే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Food and Age: ఇలాంటి ఫుడ్ తింటే.. త్వరగా ముసలి వాళ్లవుతారట !

Food For Better Digestion: భోజనం చేసాక ఇవి తింటే.. జీర్ణ సమస్యలు దూరం

Big Stories

×