BigTV English

Ravi Teja’s Mr Bachhan: యూపీలో ‘మిస్టర్ బచ్చన్’ షెడ్యూల్ పూర్తి.. అయోధ్య రామున్ని ద‌ర్శించుకున్న దర్శకుడు!

Ravi Teja’s Mr Bachhan: యూపీలో ‘మిస్టర్ బచ్చన్’ షెడ్యూల్ పూర్తి.. అయోధ్య రామున్ని ద‌ర్శించుకున్న దర్శకుడు!

Ravi Teja’s Mr Bachhan Director Harish Shankar Visits Ayodhya Ram Mandir: మస్ మహారాజా ప్రస్తుతం ఫుల్ దూకుడు మీద ఉన్నాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఈ ఏడాది ‘ఈగల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత అంతా తారుమారు అయిపోయింది.


ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా మిగిలింది. దీంతో రవన్న ఈ సారి తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చేస్తున్నాడు.


మాస్ రీయూనియన్‌గా వస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్‌ను మేకర్స్ పంచుకున్నారు. ఈ మూవీ ఉత్తరప్రదేశ్‌లో 30 రోజుల షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుందని తెలిపారు. ఈ మేరకు ఈ షెడ్యూల్ షూటింగ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

Also Read: మిస్టర్ బచ్చన్ స్టోరీ ఇదే.. హిట్ కన్ఫర్మ్ ?

ఇక ఈ షూటింగ్ పూర్తయిన అనంతరం దర్శకుడు హరీశ్ శంకర్ అండ్ టీం అయోధ్య రామమందిరం ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు అక్కడ రామ్ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే దర్శకుడు హరీశ్ శంకర్ పవన్ కల్యాన్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ చేస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ సమరం మొదలు కావడంతో పవన్ ఈ మూవీకి బ్రేక్ ఇచ్చాడు. ఈ క్రమంలో దర్శకుడు హరీశ్.. రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ను స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఇందులో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు.

Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×