BigTV English

Sindooram: సిందూరం.. కృష్ణ వంశీ ఆ టైటిట్ పెట్టడానికి కారణం ఇదే, పాక్‌పై ప్రతీకారానికి సరైన అర్థం!

Sindooram: సిందూరం.. కృష్ణ వంశీ ఆ టైటిట్ పెట్టడానికి కారణం ఇదే, పాక్‌పై ప్రతీకారానికి సరైన అర్థం!

Big Tv Originals: ఆపరేషన్ సిందూర్.. దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరిది. పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ కి ప్రధాని మోదీ ఆ పేరుని సూచించారని తెలుస్తోంది. అయితే అసలు సిందూరం అంటే అర్థమేంటి..? ఈ ఆపరేషన్ కి ఆ పేరు ఎందుకు పెట్టారు. దీనిపై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అయితే అన్నిటికంటే మించి ఆ పేరుని 1997లోనే తన సినిమాకి పెట్టిన దర్శకుడు కృష్ణవంశీ పేరు కూడా ఇప్పుడు మారుమోగిపోతోంది. ఆ నాటి కృష్ణ వంశీ సిందూరానికి, నేటి ఆపరేషన్ సిందూర్ కి మధ్య ఉన్న సారూప్యత ఏంటి..?


సిందూరం అంటే ఎరుపు రంగు అని అర్థం. అయితే సిందూర వర్ణం ఎరుపు రంగుకి కాస్త భిన్నంగా ఉంటుంది. కుంకుమని కూడా సిందూరం అంటారు కానీ, సిందూరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆంజనేయ స్వామి ఆలయాల్లో కుంకుమతోపాటు సిందూరం కూడా ఉంటుంది. ఆ సిందూరాన్ని ధరిస్తే హనుమంతుడి శక్తి, ఆశీస్సులు మనకు లభిస్తాయని భక్తుల నమ్మకం.

ఒక రంగుగా కాకుండా సిందూరానికి భారతీయ సంస్కృతిలో మరింత గొప్పదనం ఉంది. మన సంస్కృతిలో నూతన వధువు నుదుటన సిందూరాన్ని అలంకరించుకుంటుంది. అంటే సిందూరం ఆమె ఐదోతనానికి చిహ్నం అన్నమాట. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మగవారినే చంపారు. అది కూడా మతం అడిగి మరీ తుపాకి ఎక్కుపెట్టారు. అంటే హిందూ స్త్రీల సిందూరాన్ని వారు తొలగించారనే అనుకోవాలి. అలాంటి వారిపై జరిగే ప్రతీకార చర్యకు మనం ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టుకున్నాం. అంటే భారత స్త్రీల సిందూరాన్ని తొలగించినా.. వారిలోని ధైర్యాన్ని మాత్రం తొలగించలేకపోయారని, అందుకే ఆపరేషన్ సిందూర్ పేరుతో బదులు తీర్చుకున్నామని దేశం గర్వంగా చెబుతోంది.


కృష్ణవంశీ సిందూరం..
1997లో కృష్ణవంశీ తెలుగులో సిందూరం అనే సినిమా తీశారు. ఇందులో నక్సలిజం గురించిన చర్చ ఉంటుంది. నక్సలిజంలోకి బలవంతంగా నెట్టివేయబడిన బుల్లిరాజు పాత్రధారి బ్రహ్మాజీ పోరాటమే ఈ సినిమా. ఇక్కడ సిందూరం అనే టైటిల్ పెట్టడానికి దర్శకుడు గొప్ప సాహసం చేశారు. ఆ టైటిల్ కి ఉన్న ఆర్థ్రతను సినిమాలో చూపించగలననే నమ్మకంతోనే ఆ పేరు పెట్టుకున్నారాయన. నిజంగా సిందూరం సినిమా చూస్తుంటే త్యాగం, హింస, ప్రేమ, రక్తపాతం.. అన్నీ ఆ టైటిల్ ని జస్టిఫై చేస్తున్నట్టు కనపడతాయి.

తిరుగుబాటే సిందూరం..
సిందూరం సినిమాలో బ్రహ్మాజీ తిరుగుబాటు కనపడుతుంది. అన్యాయాన్ని ఎదుర్కోడానికి అతడు చేసే ప్రయత్నం, అందులో ఎదురయ్యే అడ్డంకులు, విప్లవాత్మక ఉద్దేశం, సామాజిక ఘర్షణ, హింసాత్మక తిరుగుబాటు.. అన్నీ ఇందులో కనపడతాయి. ఆ తిరుగుబాటునే దర్శకుడు సిందూరంగా తెరకెక్కించాడు. ఉగ్రవాదులపై జరిగిన ఆ తిరుగుబాటే నేటి ఆపరేషన్ సిందూర్ గా చరిత్రపుటల్లోకెక్కింది.

అన్యాయంపై తిరుగుబాటు..
సిందూరం సినిమాలో అన్యాయంపై తిరుగుబాటు చేస్తారు, ఆపరేషన్ సిందూర్ ఉగ్రమూకలపై జరిగిన తిరుగుబాటు. సినిమా సిందూరం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఆపరేషన్ సిందూర్ ఉగ్రమూకలకు సరైన సమాధానంగా యావత్ భారత దేశ ప్రజల మన్ననలు అందుకుంటోంది. శాంతి స్థాపనకు కొన్నిసార్లు రక్తపాతం తప్పనిసరి. ఉగ్రమూకలకు మనం చెప్పే సమాధానం వారికి జీవితాంతం గుర్తుండిపోవాలి. అదే నేడు జరిగింది. ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ కి గట్టి గుణపాఠంగా మారింది. మరోసారి దొంగదెబ్బ తీయాలని చూస్తే భారత్ పంజా దెబ్బ మరింత బలంగా పడుతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×