BigTV English

Pakistan Stock Market: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు

Pakistan Stock Market: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు

Pakistan Stock Market: 25 నిమిషాలు..!! 24 మిస్సైళ్లు..! 9 టార్గెట్లు..! పాక్‌ ముష్కర మూకపై త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్‌ ఇది. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత బలగాలు ఆపరేషన్ సిందూర్‌ చేపట్టింది. సరిగ్గా రాత్రి ఒంటిగంట ఐదు నిమిషాలకు ఆపరేషన్‌ మొదలైంది. గ్రౌండ్‌ లాంచ్‌, ఎయిర్ లాంచ్‌ మిస్సైళ్లతో ఎటాక్ చేశాయి. నిఘా డ్రోన్లతో టార్గెట్స్‌ మానిటరింగ్‌ చేస్తూ.. టార్గెట్స్‌ చుట్టుపక్కల పౌరులు గాయపడకుండా జాగ్రత్త తీసుకున్నాయ్‌. లేజర్‌ మిస్సైళ్లు, శాటిలైట్ గైడెడ్‌ మిసైళ్లతో ఎటాక్‌ చేశాయి. ఒంటిగంట 30 నిమిషాలకు ముగిసింది. జస్ట్‌ 25 నిమిషాల్లోనే 9 టార్గెట్లపై మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి త్రివిధ దళాలు. నిమిషానికి ఒక మిస్సైల్‌ చొప్పున, 24 మిస్సైళ్లతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 60 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.


P.O.J.Kలో ఐదు ప్రాంతాలు, పాక్‌లో నాలుగు ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశాయి. బహవల్‌పూర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన హెడ్ క్వార్టర్ పూర్తిగా ధ్వంసమైంది. ఇందులో 14 మంది చనిపోయారు. మృతుల్లో జైషే మహ్మద్‌ చీఫ్ మసూద్‌ అజర్‌ ఫ్యామిలీకి చెందిన పది మంది ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలియి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 శాతం మార్కెట్లు డౌన్ అయింది. అర్థరాత్రి భారత్ కురిపించిన బాంబులకు కరాచీ స్టాక్ ఇండెక్స్‌లో రక్తపాతం కనిపించింది. ఇవాళ మార్కెట్ ప్రారంభం అవుతూనే KSE100.. 6,272 పాయింట్లు నష్టపోయింది.


నిజానికి భారత్ పూర్తి స్థాయి యుద్ధ ప్రకటించలేదు. కేవలం చిన్నపాటి సర్టికల్ స్ట్రైక్స్ చేసింది. కానీ.. ఉగ్రవాదులపై దాడి ఇంతటితో ఆగుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. టెర్రరిస్టుల టార్గెట్‌గా భారత్ విడతల వారీగా దాడులు చేస్తూనే ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ భయంతోనే పాక్ స్టాక్ మార్కెట్‌లోని ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.

పహల్గమ్ దాడి తర్వాత భారత్ ఆంక్షలు విధించిన రోజే కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2 శాతం నష్టపోయింది. అప్పటి నుంచి నష్టాల్లోనే కొనసాగుతోంది. ఇవాళ ఏకంగా 6 శాతం కుప్పకూలాయి పాక్ స్టాక్ మార్కెట్లు. అయితే.. భారత్ మార్కెట్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉగ్రదాడి, పాక్ ఆంక్షలకు భారతీయ మార్కెట్ల చలించలేదు. ఇవాళ కూడా ఆపరేషన్ సిందూర్ ప్రభావం మన మార్కెట్లపై కనిపించలేదు.

Also Read: పదేళ్లలో 3 సార్లు.. తోలు తీసి ఆరేసిన భారత్.. బుద్ధి తెచ్చుకోని పాక్!

భారత్‌ దెబ్బకొడితే ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కు ఇప్పుడు అర్థం అయి ఉంటుంది. ఒక్క చోట దాడి చేసి అమాయకులను బలిగొంటే.. దానికి ప్రతీకారంగా భారత్‌ ఏకంగా 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. మన పవర్ ఎంటో.. మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించింది. భారత దాడిని తట్టుకోలేక.. పాకిస్తాన్ టీవీ యాంకర్ లైవ్‌లోనే బోరున ఏడ్చింది. భారత్ అటాక్ చేసింది అని చెప్తూనే.. వెక్కివెక్కి ఏడ్చింది.  పహల్గామ్ దాడి తర్వాత యావత్ భారతం.. శోకసంద్రంలో మునిగిపోయింది. అమాయక టూరిస్ట్‌లను పొట్టనబెట్టుకున్న వారి అంతుచూడాలని భీష్మించుకు కూర్చుంది. ఆ నొప్పి ఇప్పుడిప్పుడే పాక్‌కు తెలిసొస్తుంది.

Related News

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Big Stories

×