E-Paper
Advertisement

Kalki 2898 ad: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై దర్శకుడు క్రేజీ అప్డేట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

Kalki 2898 ad: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై దర్శకుడు క్రేజీ అప్డేట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్
Advertisement

Prabhas - Kalki 2898 ad update

Prabhas – Kalki 2898 AD Update: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ మాస్ లుక్ అభిమానులకు ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. ఎప్పటి నుంచో ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ప్రభాస్‌కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది.

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ లైనప్‌లలో చాలా సినిమాలే ఉన్నాయి. అందులో ‘కల్కి 2898ఏడీ’ సినిమా ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో విజువల్స్, ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది. అంతేకాకుండా గ్లింప్స్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

Advertisement

READ MORE: ప్రభాస్ ‘కల్కి’ వాయిదా.. మేకర్స్ ఫుల్ క్లారిటీ..

కాగా ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సైన్స్, పురాణాలు.. ఇలా అన్ని కలిపి ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్టోరీని దర్శకుడు నాగ్ అశ్విన్ లీక్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

READ MORE: ప్రభాస్ ‘కల్కి’ థీమ్ మ్యూజిక్ రివీల్.. ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. మెంటల్ ఎక్కిస్తున్న వీడియో!

దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్‌లో పాల్గొన్నాడు. అక్కడ ఆయన కల్కి మూవీ గురించి అదిరిపోయే అప్డేట్‌ను అందించాడు.

ఈ సినిమా మహాభారతం నుంచి స్టార్ట్‌ అయి 2898లో పూర్తవుతుందని తెలిపాడు. అందుకే ఈ సినిమాకు ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చెప్పాడు. ఈ సినిమా 6000 ఏళ్ల మధ్య జరిగే కథని చూపిస్తుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

READ MORE: ప్రభాస్ ‘కల్కి’ మూవీకి దీపికా రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.. రూ. 20 కోట్లా..?

ఇకపోతే ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుంది. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌, అమితాబ్ బచ్చన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటాని, మరికొంత మంది నటీ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×