BigTV English
Advertisement

Deepika Padukone Remuneration in ‘Kalki’: ప్రభాస్ ‘కల్కి’ మూవీకి దీపికా రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.. రూ. 20 కోట్లా..?

Deepika Padukone Remuneration in ‘Kalki’: ప్రభాస్ ‘కల్కి’ మూవీకి దీపికా రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.. రూ. 20 కోట్లా..?

Deepika Padukone Remmunaration Prabhs ‘Kalki’ 2898 Ad: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఏ సినిమా చేసినా తమ అభిమానులకు కావాల్సినంత ఎనర్జీని ఇస్తుంది. ప్రస్తుతం ఆమె రేంజ్‌ పీక్స్‌లో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సోలోగా సినిమాలు చేసినా.. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టే సత్తా ఈ హీరోయిన్‌కి ఉంది.


అంతేకాకుండా కేవలం ఒంటిచేత్తో రూ.500 కోట్లు సాధించిన రికార్డు దీపీకకే సాధ్యం. పద్మావతి మూవీతో తన సత్తా ఏంటో అందరికీ నిరూపించింది. దీంతో ఆమెకు మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి తన నటన, అందం, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకాభిమానులను కట్టిపడేస్తుంది.

ముఖ్యంగా గతేడాది విడుదలైన పఠాన్ మూవీలో షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్‌గా నటించి అదరగొట్టేసింది. మాస్ యాక్షన్ సీన్లలో ఫైట్లతో దుమ్ము దులిపేసింది. ఆ తర్వాత కూడా జవాన్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించింది.


అయితే ఈ భామ బాలీవుడ్‌లో మోస్ట్ టాప్ హీరోయిన్‌ లిస్ట్‌లోకి చేరిపోయింది. దీంతో తాను చేసే ఒక్కొక్క సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

READ MORE: Deepika Padukone: దీపికా పదుకొనే ఏడాది సంపాదన అన్ని కోట్లా..?

అయితే ఆమె తీసుకుంటున్న పారితోషికంపై ప్రస్తుతం బాలీవుడ్‌లో పెద్ద రచ్చే జరుగుతుంది. కానీ రెమ్యూనరేషన్‌లో ఎలాంటి మార్పు లేకుండా దీపిక దూసుకుపోతుంది. కాగా బాలీవుడ్‌ నటించినందుకే ఇంత మొత్తం తీసుకుంటుందా? లేక ఇతర ఏ భాషల్లోనైనా ఇలానే డిమాండ్ చేస్తుందా? అని చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు.

అయితే ఈ భామ బాలీవుడ్‌లోనే కాకుండా ఏ భాషలో నటించిన దీనికంటే ఎక్కువగానే డిమాండ్ చేస్తోందట. దీనికి నిదర్శనం టాలీవుడే. ప్రస్తుతం దీపికా పదుకొనే టాలీవుడ్‌లో ఓ మూవీ చేస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898ఏడీ’ మూవీ రూపొందుతోంది.

ఈ మూవీ ద్వారా దీపిక తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ మూవీకి గానూ ఈ నటి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె రెమ్యూనరేషన్ వివరాలు తెలిసి మిలిగిన స్టార్ హీరోయిన్లు షాక్ అవుతున్నారు.

READ MORE:Prabhas: ప్రభాస్ బర్త్ డే విషెస్ వేరే లెవెల్.. దీపికా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

హీరోల మాదిరిగానే ఈ అందాల యాక్షన్ భామ భారీ పారితోషికం తీసుకుంటుందట. ఈ మూవీకోసం ఆమె మామూలు కంటే కాస్త ఎక్కువ కాల్షీట్లు కేటాయించిందని సమాచారం. అంతేకాకుండా ఈ మూవీలో ఆమె రిస్కీ షాట్క్‌లో కూడా నటించాల్సి వస్తోందట. అందువల్లనే దీపికా ఇంతవరకూ ఏ సినిమాకు డిమాండ్ చేయనంతగా ఈ మూవీకి డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది.

దీపికా ఈ మూవీ కోసం దాదాపు రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం మినిమమ్ మాత్రమేనని.. రెమ్యూనరేషన్ మరింత పెరిగేదే తప్ప తగ్గే అవకాశం లేదని సమాచారం. దీంతో భారీ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా దీపికా పదుకొనే రికార్డ్ క్రియేట్ చేసింది.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×