E-Paper
Advertisement

Kalki 2898 AD Theme Music: ప్రభాస్ ‘కల్కి’ థీమ్ మ్యూజిక్ రివీల్.. ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. మెంటల్ ఎక్కిస్తున్న వీడియో!

Kalki 2898 AD Theme Music: ప్రభాస్ ‘కల్కి’ థీమ్ మ్యూజిక్ రివీల్.. ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. మెంటల్ ఎక్కిస్తున్న వీడియో!
Advertisement

Prabhas – Kalki 2898 AD Theme Music: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీకి సంబంధించిన థీమ్ మ్యూజిక్‌ను తాజాగా ఒక కాన్సర్ట్‌లో సంగీత దర్శకుడు ప్లే చేయగా.. దానికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. గతం, వర్తమానం, భవిష్యత్తు.. ఇలా మూడు టైమ్ లైన్స్‌పై హిందూ మైథాలజీ కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్‌గా దిశా పటానీ కనిపించనుంది.

Advertisement

అంతేకాకుండా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ స్టార్ హీరోలు ఇందులో భాగం కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక వీరితో పాటుగా టాలీవుడ్‌కి చెందిన మరెందరో హీరోలు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ విష్ణుమూర్తి పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

READ MORE:Prabhas Kalki | ప్రభాస్ ‘కల్కి’ లో రెండు అతిథి పాత్రలు.. ఆ ఇద్దరూ స్టార్ హీరోలే!

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఒక గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇవి మినహా ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ప్రేక్షకాభిమానులు నిరాశలో ఉన్నారు. అందువల్ల ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తాజాగా ఓ సర్ప్రైజ్ అందించగా.. దానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అదేంటంటే..

తాజాగా చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సంతోష్ నారాయణన్ ‘నీయే ఒలీ’ కాన్సర్ట్‌ను నిర్వహించారు. ఈ కాన్సర్ట్‌కు ఎంతోమంది ఆడియన్స్, అభిమానులు వచ్చారు. ఈ సందర్భంలో ‘కల్కి 2898ఏడీ’కి సంబంధించిన థీమ్ గ్లింప్స్‌ను ప్లే చేశాడు. దాదాపు 2 నిమిషాల వరకు ఈ థీమ్ గ్లిప్స్‌ను ప్లే చేయగా.. దీనికి ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన లభించింది.

బ్యాక్‌గ్రౌండ్‌లో ‘కల్కి’ విజువల్స్‌తో స్టేడియం మొత్త దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ముందుగా ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అంటే ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ కాన్సర్ట్‌లో ఈ థీమ్ గ్లింప్స్ విన్న తర్వాత ప్రతీ ఒక్కరికీ అంచనాలు పెరిగిపోయాయి. ఆయన వర్క్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

READ MORE: kalki 2898 Ad update : మూవీకే ఆ సీన్ హైలెట్ .. కల్కి నుంచి క్రేజీ అప్డేట్.. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్లు చేసేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ యూరోప్‌లో జరుపుకుంటోంది.

ఇందులో భాగంగా మూవీ మేకర్స్ ప్రభాస్, దిశా పటానీల మధ్య ఒక సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ మూవీని మే9న రిలీజ్ చేస్తామని ఇదివరకే తెలపడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చిత్రబృందం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×