BigTV English
Advertisement

Rajamouli: యాంకర్ రష్మీ ప్రేమలో రాజమౌళి.. ఆశ్చర్యంలో ఇండస్ట్రీ.. ఇదెక్కడి కనెక్షనబ్బా..!

Rajamouli: యాంకర్ రష్మీ ప్రేమలో రాజమౌళి.. ఆశ్చర్యంలో ఇండస్ట్రీ.. ఇదెక్కడి కనెక్షనబ్బా..!

Rajamouli:సినీ పరిశ్రమలో ప్రేమ బంధం ఎప్పుడు ఎవరి మధ్య ఏర్పడుతుందో చెప్పడం అసాధ్యం. ఒకరికొకరికి కనెక్షన్ లేకపోయినా.. అనూహ్యంగా వారి మధ్య ప్రేమ ఉందంటూ వచ్చే వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఒక జంట గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక వారెవరంటే దిగ్గజ దర్శకుడు, తన ప్రతిభతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి (Rajamouli).. బుల్లితెరపై యాంకర్ గా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మీ గౌతమ్ (Rashmi Gautam) మధ్య ప్రేమ అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం విని అటు ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అసలు రాజమౌళికి , రష్మికి మధ్య పరిచయం ఎప్పుడు? ఎక్కడ మొదలైంది..? అయినా వీరిద్దరి మధ్య ప్రేమ ఏంటి ? అంటూ అందరూ పలు రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


రష్మీ ప్రేమికుడిగా మారిన రాజమౌళి..

దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి వరుస చిత్రాలు చేస్తూ ఏకంగా పాన్ ఇండియా గుర్తింపుతో పాటు ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్ ‘ తో ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకున్నారు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ రావడమే కాదు.. తనకోసం పనిచేసిన వారికి గుర్తింపు అందించారు. అలాగే తెలుగు సినిమా ఖ్యాతిని కూడా ఎల్లలు దాటించారు. అలాంటి ఈయన గురించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవ్వగా అసలు విషయంలో వెళితే.. రాజమౌళి ఒక షార్ట్ ఫిలింలో యాంకర్ రష్మితో కలిసి ప్రేమికుడిగా నటించినట్లు తెలుస్తోంది. ‘విక్రమార్కుడు’ సమయంలో ప్రమోషన్ల కోసం ఆయన రష్మీ ని ప్రేమించే వ్యక్తిగా అందులో నటించారు. ఇక ఈ వీడియోని ఒక నెటిజన్ పోస్ట్ చేయడంతో టాలీవుడ్ అభిమానులు ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా ప్రమోషన్స్ ను ఎలా చేయాలో కూడా జక్కన్నకు బాగా తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది దిగ్గజ ధీరుడు మన రష్మీ తోనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మీ ప్రేమలో రాజమౌళి అంటూ వస్తున్న వార్తలకు ఈ విధంగా చెక్ పడిందని చెప్పవచ్చు.


సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్గా తొలి ప్రయాణం..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ఇండస్ట్రీలోకి రాకముందు సీరియల్ ఎపిసోడ్ కి డైరెక్టర్ గా పనిచేసేవారు. అలా ‘శాంతి నివాసం’ సీరియల్ తో తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి.. ఆ తర్వాత సినిమాలలోకి వచ్చారు. నిజానికి కథను పట్టుకొని ప్రభాస్ (Prabhas) ను మొదలుకొని ఎంతోమంది హీరోల చుట్టూ తిరిగారు. కానీ నూతన దర్శకుడు తమకు విజయాన్ని ఇస్తారో లేదో అని అనుమానాలతో ఆయన కథను అందరూ రిజెక్ట్ చేశారు. కానీ ఎన్టీఆర్(NTR ) దగ్గరకు వెళ్లడంతో కథ పట్టాలెక్కింది. వాస్తవానికి నందమూరి కుటుంబానికి కొత్త వాళ్లను ఆదరించడం ఎప్పటినుంచో వస్తున్న అలవాటు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రాజమౌళికి అవకాశం ఇచ్చారు. అలా ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వచ్చి భారీ విషయాన్ని అందుకుంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14" style=" background:#FFF; border:0; border-radius:3px; box-shadow:0 0 1px 0 rgba(0,0,0,0.5),0 1px 10px 0 rgba(0,0,0,0.15); margin: 1px; max-width:540px; min-width:326px; padding:0; width:99.375%; width:-webkit-calc(100% - 2px); width:calc(100% - 2px);">
?utm_source=ig_embed&utm_campaign=loading" style=" background:#FFFFFF; line-height:0; padding:0 0; text-align:center; text-decoration:none; width:100%;" target="_blank">

View this post on Instagram

?utm_source=ig_embed&utm_campaign=loading" style=" color:#c9c8cd; font-family:Arial,sans-serif; font-size:14px; font-style:normal; font-weight:normal; line-height:17px; text-decoration:none;" target="_blank">A post shared by Share Chey Mawa (@share_chey_mawa)

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×