BigTV English

Samantha: ఇలా దెబ్బ కొట్టావా రష్మిక.. సమంత బాధ అదేనా?

Samantha: ఇలా దెబ్బ కొట్టావా రష్మిక.. సమంత బాధ అదేనా?

Samantha: ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హిరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన ఈ సినిమా ఒక క్లాసిక్ అని చెప్పాలి. ఇప్పటికీ ఆ సినిమా చూస్తున్న కూడా ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాతోనే నాగచైతన్యత కూడా సమంతకు మంచి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. ఆ తర్వాత వాళ్లకు ఉన్న వ్యక్తిగత కారణాల వలన పరస్పర అంగీకారంతో ఇద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. సమంత విషయానికి వస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కూడా నటించింది సమంత.


స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి మంచి పేరు సాధించుకుంది. సమంతకు విపరీతమైన క్రేజ్ ఉండేది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. కానీ ప్రస్తుతం సమంత పరిస్థితి వేరు. ఒకానొక సందర్భంలో సమంతాకు ఉన్న ఆరోగ్య సమస్యల వలన వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయింది. శకుంతలం, యశోద వంటి సినిమాలు చేసినా కూడా అవి అంతంత మాత్రమే ఆడాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సిటాడెల్‌కు నిరాశపరచడంతో, చాలామంది నిర్మాతలు సమంతతో సినిమా చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఇటు టాలీవుడ్ లో కూడా ఆమె కమ్ బ్యాక్ కష్టంగా మారే పరిస్థితి.

Also Read : Rajamouli: యాంకర్ రష్మీ ప్రేమలో రాజమౌళి.. ఆశ్చర్యంలో ఇండస్ట్రీ.. ఇదెక్కడి కనెక్షనబ్బా..!


ఇక ప్రస్తుతం అవకాశాలు అన్నీ కూడా రష్మికా కు వస్తున్నాయి. రష్మిక ఇప్పుడు బాలీవుడ్ హాట్ ఫేవరెట్ అయ్యింది. యానిమల్, పుష్ప 2, చావా హిట్ తర్వాత ఆమెకు డిమాండ్ బాగా పెరిగింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఛలో సినిమాలతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రష్మికకు వరుస అవకాశాలు వచ్చాయి. సూపర్ సార్ మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఏ స్థాయి హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో రష్మికకు గుర్తింపు లభించింది. మంచి స్టార్డం వచ్చిన తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేయడం కామన్ థింగ్. ఇప్పుడు రష్మిక కూడా అదే బాటలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. ఏదేమైనా సమంత యాక్టివ్ గా లేకపోవడం రష్మికకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

Also Read : Thandel Collections : దూకుడు తగ్గని తండేల్.. బాక్సాఫీస్ వద్ద జాతర.. ఎన్ని కోట్లంటే..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×