BigTV English

Prabhas Spirit Movie Budget: ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీపై దర్శకుడు సందీప్ రెడ్డి సాలిడ్ అప్డేట్.. ఎన్ని కోట్లతో ఈ సినిమా తెరకేక్కిస్తున్నారో తెలుసా..?

Prabhas Spirit Movie Budget: ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీపై దర్శకుడు సందీప్ రెడ్డి సాలిడ్ అప్డేట్.. ఎన్ని కోట్లతో ఈ సినిమా తెరకేక్కిస్తున్నారో తెలుసా..?
Prabhas - Sandeep Reddy Vanga
Prabhas – Sandeep Reddy Vanga

Prabhas – Sandeep Reddy Vanga Combo Movie Spirit Budget: ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబో సెట్ అయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఈ మూవీ పై ఫుల్ హైప్ క్రియేట్ అయింది. ఒకవైపు ప్రభాస్ సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీతో బాక్సాఫీసును షేక్ చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరు ఒకటయ్యారు. దీంతో వీరి కాంబోపై ఓ రేంజ్‌లో బజ్ ఏర్పడింది.


‘స్పిరిట్’గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో ప్రభాస్ ఎన్నడూ లేని ఓ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాల్లో ప్రభాస్ ఎందులోనూ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించలేదు. కానీ ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపింబోతుండటంతో సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు.

అందులోనూ ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు దర్శకత్వం వహించిన సినిమాలేవీ ఫ్లాప్ కాలేదు. ప్రతి సినిమా మంచి హిట్ అయ్యి భారీ కలెక్షన్లను నమోదు చేశాయి. అయితే సందీప్ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లను ఇస్తుంటాడు.


Also Read: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది..

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ.. ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్‌ను ఏ సినిమాలోనూ చూడని విధంగా చూస్తారు. ఇందులోని ఒక్కొక్క సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. సిద్ధంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. ఈ మూవీ బడ్జెట్ గురించి ఆసక్తిక విషయాల్ని పంచుకున్నాడు.

‘నా తర్వాత సినిమా ప్రభాస్‌తో తీస్తున్నాను. ‘స్పిరిట్’గా తెరకెక్కించబోతున్న ఈ సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందబోతుంది. అయితే ఈ మూవీ కంప్లీట్ అయి థియేటర్లలోకి వచ్చిని మొదటి రోజునే ఏకంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లను నమోదు చేస్తుందని అనుకుంటున్నాను.’’ అంటూ తెలిపాడు. దీంతో సందీప్ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతడు ఇచ్చిన ఈ అప్డేట్‌తో సినీ ప్రియులు, ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు.

కాగా ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898ఏడీ’, మారుతీ దర్శకత్వంలో ‘రాజా సాబ్’ మూవీలు చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్స్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. త్వరలో ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Related News

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big Stories

×