BigTV English

Balakrishna’s Unstoppable Season 4: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్.. అన్‌స్టాపబుల్ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది

Balakrishna’s Unstoppable Season 4: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్.. అన్‌స్టాపబుల్ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది
Balakrishna
Balakrishna

Unstoppable With NBK Season 4: టాలీవుడ్ నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య బాబు ప్రస్తుతం మరో స్టార్ డైరెక్టర్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. ‘వాల్తేరు వీరయ్య’ ఫేం బాబీ దర్శకత్వంలో ‘NBK 109’ వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ చేస్తున్నాడు.


ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా గ్లింప్స్‌లో బాలయ్య బాబు వేటాడిన తీరు చూస్తుంటే.. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌ సినిమాలా అనిపిస్తుంది. ఎగసిపడి పై పైకి లేస్తున్న మంటల వద్ద విలన్లను రెండు గొడ్డళ్లతో వేటాడిన తీరు ఫ్యాన్స్‌కు బాగా నచ్చేసింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఓ వైపు సినిమాలతోనూ మరో వైపు కొన్ని షోలకు హూస్ట్‌గా కూడా దుమ్ము దులిపేస్తాడు. అందులో ఒకటి ‘అన్‌స్టాపబుల్’. ఒకరకంగా చెప్పాలంటే ఈ షోకు నట సింహం బాలయ్య బాబు వల్లనే మంచి ఆదరణ లభించిందని చెప్పాలి. ఈ షోలో బాలయ్య మాటలు, డైలాగ్స్, కామెడీ మామూలుగా ఉండదు.


Also Read: వేశ్యలుగా మారిన స్టార్ హీరోయిన్లు..

షోకు వచ్చిన సెలబ్రెటీలతో సరదా సరదాగా నవ్వుతూ.. నవ్విస్తూ ఆటాడుకుంటాడు. గెస్ట్‌ల సీక్రెట్‌లతో ఓ రేంజ్‌లో ఆడేసుకుంటాడు. అయితే ఇప్పటికే వచ్చిన మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, బాలయ్యబాబు అభిమానులకు ఓ గుడ్ న్యూస్.

‘అన్‌స్టాపబుల్ సీజన్ -4’కు రంగం సిద్ధమైంది. ఉగాది సందర్భంగా ఈ షో త్వరలో ప్రసారం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఓటీటీ సంస్థ ఆహా తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే ‘అన్‌స్టాపబుల్ సీజన్4’ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ఈ సీజన్ 4 ఎలా ఉండబోతుందో.. ఏఏ సెలబ్రెటీలు హాజరవుతారో చూడాలి. దీని తర్వాత బాలయ్యబాబు మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. అఖండతో బాక్ బస్టర్ హిట్ అందుకున్న అతడు ఇప్పుడు అఖండ 2లో నటించేందుకు సిద్ధమయ్యాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సీక్వెల్ మరింత గ్రాండ్‌ లెవెల్లో పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×