E-Paper
Advertisement

Chhattisgarh Bus Accident: లోయలో పడిన బస్సు.. 12 మంది మృతి.. కాసేపట్లో చేరుకుంటామనగా…

Chhattisgarh Bus Accident: లోయలో పడిన బస్సు.. 12 మంది మృతి.. కాసేపట్లో చేరుకుంటామనగా…
Advertisement
Chhattisgarh Bus Accident, falls into ditch in Durg 12 people dead
Chhattisgarh Bus Accident, falls into ditch in Durg 12 people dead

12 People died in Chhattisgarh Bus Accident: ఛత్తీస్‌గఢ్‌లో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

దుర్గ్ నుంచి ఓ ప్రైవేటు బస్సు ఉద్యోగులను మరో ప్రాంతానికి తీసుకెళ్తోంది. మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల భారీ గుంతలో పడిపోయింది. స్పాట్‌లో 11 మంది మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఘటన జరిగిన ప్రాంతం నుంచి బాధితులను రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ తరలించారు.

Advertisement

ఓ డిస్టిలరీ సంస్థకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. ఆఫీసులో విధులు ముగించుకుని ఉద్యోగులు ఇంటికి బస్సులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మట్టి గని వద్ద 40 అడుగుల లోయలో పడిపోయింది బస్సు. మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు ఘటన విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఎయిమ్స్‌కు చేరుకున్నారు. బాధితుల పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

Also Read: Haryana: హర్యానాలో స్కూల్ బస్ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం..

Advertisement

ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అటు ప్రధాని మోదీ స్పందించారు. బస్సు ప్రమాదం చాలా బాధాకరమన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మరోవైపు బస్సు ప్రమాద ఘటనపై ఆ రాష్ట్రప్రభుత్వం స్పందించింది. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించింది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×