E-Paper
Advertisement

Shankar Daughter Marriage: డైరెక్టర్ శంకర్ కూతురి పెళ్లి.. హాజరైన రజినీ, కమల్..

Shankar Daughter Marriage: డైరెక్టర్ శంకర్ కూతురి పెళ్లి.. హాజరైన రజినీ, కమల్..
Advertisement

Shankar Daughter Marriage: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ వివాహం ఘనంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయతో ఐశ్వర్య వివాహం చెన్నై లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి కోలీవుడ్ మొత్తం హాజరైంది. రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇది ఐశ్వర్యకు రెండో పెళ్లి. 2021 లో దామోదర్ రోహిత్ అనే క్రికెటర్ తో వివాహాం జరిగింది. అయితే అతనిపై లైంగిక వేధింపుల కేసు రావడంతో.. ఐశ్వర్యనే అతడి నుంచి విడాకులు తీసుకొని విడిపోయింది. ఇక దాదాపు మూడేళ్ళ తరువాత శంకర్.. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిపించాడు. ఇక నేడు వీరి వివాహం ఘనంగా జరిగింది.

Advertisement

ఐశ్వర్య కాకుండా శంకర్ కు అదితి అనే కూతురు ఉంది. ఆమె హీరోయిన్ గా కొనసాగుతోంది. శంకర్ కు.. తన కూతుళ్లను సినిమాల్లోకి తీసుకురావాలని లేదు. కానీ, అదితి పట్టుబట్టి సినిమాల్లోకి వచ్చింది. ప్రస్తుతం అదితి హీరోయిన్ గా, సింగర్ గా కొనసాగుతుంది. ఇక శంకర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ 2.. ఇంకొకటి గేమ్ ఛేంజర్. ఈ రెండు సినిమాలపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలతో శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×