Big Stories

Ruturaj Gaikwad: ఐపీఎల్ వీరుడు రుతురాజ్.. తొలి భారత బ్యాటర్‌గా రికార్డు..

CSK Captain Ruturaj Gaikwad Record: రుతురాజ్ గైక్వాడ్.. ఈ పేరు తరచూ ఇండియన్ క్రికెట్ లో వినిపిస్తుంటుంది. అయితే  చాలా మంది యువ క్రికెటర్లు.. టీ 20  సెషలిస్టుల్లా మారిపోయారు. వైట్ బాల్ క్రికెట్ లో తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించి ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో కుర్రాళ్లందరికన్నా మిన్నగా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు.

- Advertisement -

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ని ధోనీ ఎందుకు సెలక్ట్ చేశాడో ఇప్పుడందరికీ అర్థమవుతోంది. ఇలా తనెంతో మందిని టీమ్ ఇండియాకి తీసుకొచ్చి, వారి ఉన్నత భవిష్యత్తుకు తోడ్పడ్డాడు. అలాంటివారిలో రుతురాజ్ ఒకడిగా ఉన్నాడు. ప్రస్తుతం తను గురువు ధోనీ పేరు నిలబెట్టాడు.

- Advertisement -

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 2000 పరుగుల మైలు రాయి అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులు చేయడం ద్వారా రుతురాజ్ గైక్వాడ్ ఈ ఫీట్ సాధించాడు.

రోమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో బౌండరీ బాది ఐపీఎల్‌లో 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్‌ల్లో రుతురాజ్ గైక్వాడ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు కేఎల్ రాహుల్‌ల రికార్డును అధిగమించాడు.

ఓవరాల్ గా చూస్తే రుతురాజ్ కన్నా ముందు క్రిస్ గేల్ (48), షాన్ మార్ష్ (52) ఉన్నారు. కాకపోతే భారత్ లో మాత్రం తనే నెంబర్ వన్ గా ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కన్నా ముందు కేఎల్ రాహుల్ (60), సచిన్ టెండుల్కర్ (63) ఉన్నారు.

మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్ గతంలో కూడా ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో అదరగొట్టాడు. యశస్వి జైశ్వాల్ తో కలిసి ఓపెనర్ గా వచ్చి బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. కాకపోతే గాయాలబారిన పడటంతో యశస్వికి అవకాశాలు వచ్చాయి. తను వాటిని అందిపుచ్చుకుని టీమ్ ఇండియాలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు.

Also Read:  ఆ క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది..

ఇప్పుడు మళ్లీ రుతురాజ్ టీమ్ ఇండియాలో స్థానం కోసం పోరాడాల్సి వస్తోంది. మరోవైపు రింకూ సింగ్ పేరు ఓకే అయిపోయింది. రిషబ్ పంత్ మళ్లీ వచ్చేశాడు. విపరీతమైన కాంపిటేషన్ నడుస్తోంది. ఈ సమయంలో రుతురాజ్ ఇలా ఆడటంతో టీ 20 ప్రపంచకప్ కి అవకాశాలు తెరుచుకున్నట్టే అని భావించాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News