Big Stories

IndiGo flight: ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో విమానం.. ఏమైందంటే..?

IndiGo flight: అయోధ్య నుంచి ఢిల్లీ బయల్దేరిన ఇండిగో విమానంకు భారీ ప్రమాదం తప్పింది. ఇంధనం అయిపోవడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

శనివారం మధ్యాహ్నం 3.25 గంటలకు అయోధ్య నుంచి ఇండిగో విమానం బయల్దేరింది. 4.30 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సిన ఈ విమానాన్ని చండీఘడ్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో వాతావరణం సహకరించకపోవడంతో విమానం ల్యాండింగ్‌ కష్టంగా మారినట్లు పైలట్ ప్రయాణికులకు తెలిపారు. క్లిష్ట వాతావరణ పరిస్థితుల కారణంగా  విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

- Advertisement -

ల్యాండింగ్ కోసం పైలట్ రెండు చోట్ల ప్రయత్నించినా ప్రతికూల పరిస్థితుల కారణంగా అక్కడికక్కడే విమానం చక్కర్లు కొట్టింది. దీంతో విమానంలోని ఇంధనం అయిపోతుండటంతో పైలట్ చండీఘడ్ కు దారి మళ్లించారు. అయితే ఈ సమయంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా చండీఘడ్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

శనివారం జరిగిన ఈ విషయాన్ని ప్రయాణికులలో ఒకరైన ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన ఈ తన ప్రయాణ అనుభవాన్ని పౌర విమానయాన శాఖకు ట్యాగ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: Rahul’s helicopter checking: రాహుల్ చాపర్‌లో తనిఖీలు, ఏం జరిగింది?

విమానం ల్యాండ్ అయ్యే సమయాన్ని రెండు నిమిషాలకు సారిపడా ఇంధనం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. మరో ప్రయాణికుడు.. దీనిపై డీజీసీఏ దర్యాప్తు చేయాలని ట్వీట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఇండిగో సంస్థ భద్రతా వైఫల్యంమే ఇందుకు కారణమంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకూ ఇండిగో సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News