BigTV English

N ShankarSon : డైరెక్టర్ శంకర్ వారసుడు ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ..

N ShankarSon : డైరెక్టర్ శంకర్ వారసుడు ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ..

N ShankarSon : తెలుగు ఇండస్ట్రీలో వారసుల రాక కామన్.. హీరోలు హీరోయిన్ల తోనే కాకుండా దర్శకులు కూడా తమ వారసులను ఇండస్ట్రీలోకి లాంచ్ చేస్తున్నారు. కొందరు హీరోలుగా పరిచయమైతే మరికొందరు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇటీవల చాలామంది సెలబ్రిటీలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే కొందరు వారసులు మంచి సక్సెస్ ని అందుకుంటే, మరికొందరు మాత్రం సక్సెస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఇక తాజాగా తెలుగు దర్శకుడు ఎన్ శంకర్ వారసుడు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. డైరెక్టర్గా త్వరలోనే మొదటి సినిమాను లాంచ్ చెయ్యనున్నారు.. ఆ మూవీ గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..


టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనదైన ముద్ర వేశాడు డైరెక్టర్ఎన్. శంకర్. శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం, జై భోలో తెలంగాణ వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుని, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించారు. సామాజిక అంశాలను స్పృశిస్తూ కమర్షియల్ సినిమాలు రూపొందించడంలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఇప్పుడు అదే దారిలో ఆ డైరెక్టర్ తనయుడు దినేష్ మహీంద్ర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. తండ్రి అడుగు జాడల్లోనే తనయుడు తన అదృష్టాన్నిపరీక్షించుకోబోతున్నాడు. ఈ యువకుడు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా దర్శకత్వంలో అన్ని మెలకువలను ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారు. సినిమా అంటే కేవలం కథే కాకుండా, టెక్నికల్ నైపుణ్యం కూడా కీలకమనే విషయం అర్థం చేసుకున్నాడు. ఫలితంగా తన దర్శకత్వంలోనే ఓ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ లవ్ స్టోరీ మూవీ లో కొత్త హీరో, హీరోయినల తో సినిమాను లాంచ్ చెయ్యనున్నాడు. ఈ చిత్రాన్ని ఆరెక్స్ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయి, సంగీతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాటల రికార్డింగ్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత వెంటనే షూటింగ్‌ను ఏప్రిల్ నుంచి మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.. ఈ తరం యువతకు అర్థమయ్యేలా ఈ లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఇందులో నటించబోయే యాక్టర్స్ఎంపిక కూడా ఆసక్తిగా మారింది. యువతను ఆకట్టుకునేలా సంగీతం, విజువల్స్‌ కు ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.. ఇకపోతే దర్శకుడు ఎన్. శంకర్ తనయుడిగా కాకుండా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదల దినేష్ మహీంద్రలో స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తదనం, భావోద్వేగాలతో కూడిన కథతో ప్రేక్షకుల మనసు దోచేందుకు అతను సిద్ధమవుతున్నారు. ఇక ఈ డెబ్యూ సినిమాపై పరిశ్రమలో కూడా మంచి అంచనాలున్నాయి.. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఈయన అదృష్టం ఎలా ఉండబోతుందో? కొత్త సినిమాతో ఎలాంటి ప్రభంజనాల ను సృష్టిస్తారో చూడాలి.. దినేష్ మహీంద్ర దర్శకత్వంలో రాబోయే ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా అప్‌డేట్స్ విషయంలో త్వరలోనే పూర్తి వివరాలను అనౌన్స్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×