BigTV English

Fake Certificates : నకిలీ సర్టిఫికేట్లు కొంటున్నారా.? అయితే అడ్డంగా బుక్కైనట్లే – ముగ్గురు అరెస్ట్

Fake Certificates : నకిలీ సర్టిఫికేట్లు కొంటున్నారా.? అయితే అడ్డంగా బుక్కైనట్లే – ముగ్గురు అరెస్ట్

Fake Certificates : మనకు తెలిసిన వాళ్లు చెప్పారనో, ఎవరో చేశారనో.. నకిలీ సర్టిఫికేట్లు కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే.. మీరు ఎప్పుడైనా పోలీసులకు  చిక్కే అవకాశం ఉంది. మీపై ఎప్పుడైనా కేసు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.. పోలీసులు. తాజాగా.. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఇలాంటి నకిలీ సర్టిఫికేట్ల బృందాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..  వారి నుంచి నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు.


ఇలాంటి నకిలీ సర్టిఫికేట్లకు కేరాఫ్ అడ్రస్ గా పేరుగాంచిన హైదరాబాద్ లోని పాతబస్తీ పై పోలీసుల నిఘా పెంచారు. దీంతో.. కొత్త దారులు వెతుకుతున్న నకిలీగాళ్లు.. వేరే రాష్ట్రాల నుంచి దందా సాగిస్తున్నారు. ఇక్కడ ఆర్డర్లు తీసుకుని.. వేరే రాష్ట్రాల నుంచి సర్టిఫికేట్లు తెప్పిస్తున్నారు. ఇక్కడ ఒక్కో సర్టిఫికేట్ కు వేలు, లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ప్రత్యేకంగా నిఘా ఉంచారు.

తెలంగాణ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో.. హైదరా బాద్ పాతబస్తీ శాలిబండ, ఖుర్షీద్ ఝా గ్రౌండ్ దగ్గర ఉండే అబ్దుల్ ఖదీర్.. డబీర్ పుర్ లోని, ఫర్హత్ నగర్ ప్రాంతానికి చెందిన షకీల్ ఈ నకిలీ సర్టిఫికేట్ల దందా సాగిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తే పోలీసులకు దొరికిపోతామనే భయంతో.. ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారిని చేర్చుకున్నారు. వారితో కలిసి తప్పుడు పనులు పాల్పడుతున్నారు.


రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎవరైనా వీరిని సంప్రదిస్తే.. వీరు ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ ప్రాంతానికి చెందిన సంజయ్ శర్మా, సాహిల్ శర్మకి కాంట్రాక్ట్ ఇస్తుంటారు. ఇక్కడి విద్యార్థుల వివరాలను వాట్సప్ ద్వారా యూపీకి పంపిస్తే.. వారు అక్కడ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారు. వాటిని చాలా రహస్యంగా.. కొరియర్ ద్వారా నగరానికి పంపుతున్నట్లు గుర్తించారు.

ఈ నకిలీ సర్టిఫికేట్లతో అభ్యర్థులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వారికి లేని అర్హతలను చూపిస్తూ ఉద్యోగాలు సాధిస్తున్నారు. వీరి నుంచి వేల నుంచి లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, డబీర్ పుర్ పోలీసులకు తెలియడంతో.. వీరు ఉంటున్న ఇళ్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఇందులో.. వారి దగ్గర పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికేట్లను గుర్తించారు. ఇందులో.. కాకతీయ యూనివర్శిటికి చెందిన 43, ఆచార్య నాగార్జున యూనివర్శిటికి చెందిన 23, ఉస్మానియా యూనివర్శిటికి చెందిన 8 నకిలీ సర్తిఫికేట్లు ఉన్నట్లు తేల్చారు. మొత్తంగా.. ఈ నిందుతుల దగ్గర మొత్తం 91 నకిలీ సర్తిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు.  స్వాధినము చేసుకున్నారు.

తెలంగాణలోని నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం.. ఈ నకిలీ సర్టిఫికేట్ల దందాలో ప్రధాన సూత్రధారి అయిన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన సంజయ్ శర్మ పరారిలో ఉన్నట్లు తెలిపారు. ఇతని కోసం ప్రత్యేక బృందాలు యూపీ వెళ్లినట్లుగా తెలిపిన పోలీసులు.. త్వరలోనే అతన్ని కూాడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

Also Read : కిడ్నాపర్లతో డీఎస్పీ చెట్టాపట్టాల్ – పోలీస్ శాఖలో ఉంటూ కీలక సమాచారం లీక్..

ఉద్యోగాల కోసం ఇలాంటి నకిలీ సర్టిఫికేట్లు కొనుగోలు చేయొద్దని పోలీసులు  హెచ్చరిస్తున్నారు. నిందుతుల మాయమాటలు నమ్మొద్దంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో నకిలీ సర్టిఫికేట్లు బయటపడితే.. అభ్యర్థులపై సైతం ఉద్దేశ్యపూర్వకంగా మోసం కేసులు నమోదు చేయాల్సి వస్తుందని తెలుపుతున్నారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×