BigTV English
Advertisement

Japan earthquake: జపాన్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న స్టార్ డైరెక్టర్ కొడుకు

Japan earthquake: జపాన్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న స్టార్ డైరెక్టర్ కొడుకు
japan earthquake
japan earthquake

japan earthquake: జపాన్​లో వరుస భూకంపాలు ఆ దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవల సంభవించిన భూకంపం కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది క్షతగాత్రులయ్యారు. భారీ ఆస్తినష్టం కూడా సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా జపాన్ దేశాన్ని భూకంపాలు వదలడం లేదు. ఓ ప్రమాదం సంభవించి ఊపిరి పీల్చుకునే లోపే మరోసారి పెనుముప్పులా పొంచివస్తోంది. ఈ క్రమంలో పర్యటనకు వెళ్లిన వారు కూడా భయబ్రాంతులకు లోనవుతున్నారు. గతంలో భూకంపం సంభవించే కొద్ది రోజుల ముందే పాన్ ఇండియా స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ జపాన్ పర్యటన నుంచి ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ జపాన్ లో సంభవించిన భారీ భూకంపం నుంచి తప్పించుకున్నాడు.


సినిమా షూటింగ్ లు, షూటింగ్ ల తర్వాత వెకేషన్స్ అంటూ సెలబ్రిటీలు ప్రపంచ దేశాలను చుట్టేస్తుంటారు. వారి బిజీ షెడ్యూల్‌లో కాస్త తమ రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి టూర్స్ వేస్తుంటారు. ఇందులోను పర్యాటక ప్రాంతాలైన స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్ వంటి పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తుంటారు. తాజాగా డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ జపాన్ లో పర్యటించాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి జపాన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జపాన్ లో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని కార్తికేయ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

జపాన్ పర్యటనలో ఉన్నప్పుడు భారీ భూకంపం నుంచి తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. తన జీవితంలో మొదటిసారి భూకంపంను ఎక్స్ పీరియన్స్ చేసినట్లు రాసుకొచ్చాడు. జపాన్ లోని ఒక ప్రాంతంలో దాదాపు 28వ అంతస్తులో ఉండగా భూకంపం సంభవించిందని తెలిపాడు. భూకంపం సంభవించే ముందు తన స్మార్ట్ ఫోన్ లో వచ్చిన ఎర్త్ క్వేక్ అలర్ట్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు వివరించాడు.


‘నా జీవితంలో ఫస్ట్ టైం భూకంపాన్ని ఎక్స్ పీరియన్స్ చేశాను. భూకంపం వచ్చిన సమయంలో బిల్డింగ్ ఊగిపోయింది. నేను చాలా భయపడ్డాను. కానీ అక్కడి స్థానికులు మాత్రం ఏదో వర్షం పడితే ఆస్వాదిస్తున్నట్లు చూశారు. కానీ చివరకు మేం అయితే సేఫ్ గా బయటపడ్డాం’ అని పోస్ట్ క్యాప్షన్ లో రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన రాజమౌళి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్తికేయ తన ఫ్యామిలీతో కలిసి సేఫ్ గా దేశానికి చేరుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు సినీ నటులు కూడా పలువురు స్పందిస్తూ సానుభూతి తెలుపుతున్నారు.

 

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×