BigTV English

They Call Him OG: ఓజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. బ్లాస్టింగే

They Call Him OG: ఓజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. బ్లాస్టింగే

TheyCallHimOG:  ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే మొదలయ్యింది  అని పాడుకోవడం మొదలుపెట్టారు పవన్ ఫ్యాన్స్. పవన్ ఈ ఏడాది ఎన్నికల్లో గెలవడం, డిప్యూటీ  సీఎం గా మారడం  ఫ్యాన్స్ కు ఆనందంగా ఉన్నా.. ఎక్కడ అందులో బిజీగా ఉండి సినిమాలు చేయడం మానేస్తారేమో అని మనసులో ఆందోళన పెట్టుకొనే బతికేస్తున్నారు. కానీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పవన్ ఎప్పుడు ఓడిపోలేదు.  ప్రచారంలో  కూడా తన సినిమాలు బ్యాలెన్స్ ఉన్నాయి.. వాటిని ఫినిష్ చేస్తాను అని నిర్మాతలకు మాట ఇచ్చారు.


ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రెడీ అయ్యారు పవన్. ఎట్టకేలకు దాదాపు మూడు నెలల తరువాత పవన్.. సెట్ లో అడుగుపెట్టనున్నారు.   ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో  OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రాన్ని DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నాడు.

సుజీత్ మొదటి నుంచి ఈ సినిమాను ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు సాగించాడు. వారి కష్టంతో OG  సగానికి పైగా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక మిగిలిన సగాన్ని పూర్తిచేయడానికి  OG సెట్ లో త్వరలోనే అడుగుపెట్టనున్నారు.  తాజాగా మేకర్స్ .. ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేస్తూ..  OG  అప్డేట్ ను అందించారు.


పవన్, సుజీత్, డీవీవీ దానయ్య కలిసి దిగిన ఈ ఫోటోను షేర్ చేసిన మేకర్స్ ..  OG మరియు అతని స్కాడ్.. బ్యాక్ ఆన్ మిషన్ అని రాసుకొచ్చారు. సుజీత్, అమరావతి వెళ్లి పవన్ కు మొదటి పాటను వినిపించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్  2 అనగా పవన్ పుట్టినరోజున OG నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక  దానికోసమే ఈ కసరత్తు అని తెలుస్తోంది.

ఇక ఈ విషయం తెలియడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందంలో తేలియాడుతున్నారు. సగానికిపైగా షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా సెట్ లో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అడుగుపెడితే.. సుజీత్  కు షూటింగ్ చేయడం ఎంతపని. చకచకా  షూటింగ్ ను ఫినిష్ చేయడానికి సిద్దమైపోడు. మరి ఈ సినిమాతో  ఈ కాంబో ఎలాంటి రికార్డులు కొల్లగొడతారో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×