E-Paper
Advertisement

Teja: డైరెక్టర్ తేజ కుమారుడు ఎంట్రీ కు సర్వం సిద్ధం, మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్

Teja: డైరెక్టర్ తేజ కుమారుడు ఎంట్రీ కు సర్వం సిద్ధం, మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్
Advertisement

Teja: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో అవరోధాలను దాటుకుని నేడు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్న చాలామందిలో దర్శకులు తేజ ఒకరు. ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత సౌత్ సినిమాలోని టాప్ మోస్ట్ కెమెరామెన్ గా పేరు సాధించుకున్నారు. కేవలం తెలుగు తమిళ్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తాను చాటారు తేజ. సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్న తరుణంలోని అప్పుడప్పుడు చిన్న చిన్న కథలను రాయడం కూడా అలవాటు చేసుకున్నారు. దాంతోపాటు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) పరిచయం, ఆ తర్వాత కొన్ని పుస్తకాలు చదవడం వలన దర్శకత్వం వైపు కూడా ఆసక్తి మళ్లింది. అయితే చిత్రం అనే ఒక కథను రాసి రామోజీరావు గారికి చెప్పి దర్శకుడుగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. చిత్రం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ ఉంటుంది. కేవలం 40 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లలో వసూలు చేసింది.

Chitram

Advertisement

ఇక ప్రస్తుతం తేజ హిట్ సినిమా చూసి చాలా ఏళ్లు అయింది కానీ ఒకప్పుడు తేజ సినిమా అంటేనే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. చిత్రం(Chitram) నువ్వు నేను(Nuvvu Nenu) జయం(Jayam) వంటి సినిమాలు తేజ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే తేజ హిట్ సినిమాలు చేయడమే కాకుండా చాలామందిని కొత్త నటులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత తేజకి ఉంది అని చెప్పాలి. కాజల్ అగర్వాల్, నవదీప్ అలానే ఎంతోమంది కమెడియన్స్ ని కూడా తేజ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సంగీత దర్శకులను కూడా పరిచయం చేసిన ఘనత తేజకు ఉంది. ఇప్పుడు తెలుగు తెరకు తన కుమారుడుని పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తేజ దర్శకత్వంలో మొదటిసారి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఒక వ్యక్తి తోకతో పుడితే ఎలా ఉంటుంది అని అంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ సినిమాకి వాయువు అని ఒక టైటిల్ను ఫిక్స్ చేసినట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే ఓటీటీ సంస్థతో ఒప్పందం కూడా జరిగిపోయినట్లు తెలుస్తోంది. తేజ చివరిసారిగా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ చూశారు. చాలామంది కొత్త నటులకు హిట్ సినిమాలు అందించిన తేజ, తన కుమారుడికి ఏ స్థాయికి అందిస్తారు అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇక తేజ సినిమాల కంటే కూడా ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ లో తేజ మాట్లాడే విధానం చాలా మందిని ఆకట్టుకుంటుంది. కొన్ని విషయాలపై తేజకు ఉన్న క్లారిటీ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బహుశా తన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో చూసిన కష్టాలను బట్టి తేజకు ఆ అభిప్రాయాలు ఏర్పడి ఉండవచ్చు. చాలా ఇంటర్వ్యూస్ లో తేజ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారుతుంటాయి. తేజ సినిమాలు లానే తేజ ఇంటర్వ్యూస్ కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×