BigTV English

Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ చేయడం చాలా సులువు, ఇలా చేసుకుని తింటే కాల్షియం లోపం కూడా రాదు

Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ చేయడం చాలా సులువు, ఇలా చేసుకుని తింటే కాల్షియం లోపం కూడా రాదు

Mutton bone Soup: మటన్ కూర, మటన్ బిర్యానీయే కాదు ఆరోగ్యం కోసం అప్పుడప్పుడు మటన్ బోన్ సూప్ కూడా తింటూ ఉండండి. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. మటన్ సూప్ తినడం వల్ల క్యాల్షియం లోపం రాకుండా ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళలు, 50 ఏళ్లు దాటిన మగవారు వారంలో కనీసం రెండుసార్లు ఇంట్లోనే మటన్ బోన్ సూప్ తయారు చేసుకుని తాగాల్సిన అవసరం ఉంది. దీని రెసిపీ కూడా ఎంతో సులువు. ప్రెషర్ కుక్కర్లో సులువుగా దీన్ని వండేసుకోవచ్చు


కావలసిన పదార్థాలు
మటన్ బోన్స్ – అరకిలో
ఉల్లిపాయలు – రెండు
టమాటాలు – రెండు
పచ్చిమిర్చి – మూడు
కారం – ఒక స్పూను
పసుపు – పావు స్పూను
ధనియాల పొడి – అర స్పూను
జీలకర్ర పొడి – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – అరకప్పు
పుదీనా ఆకులు – అరకప్పు
లవంగాలు – మూడు
యాలకులు – మూడు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
షాజీరా – అర స్పూను
మిరియాల పొడి – అర స్పూను
బిర్యానీ ఆకులు – రెండు

మటన్ బోన్ సూప్ రెసిపీ


ప్రెషర్ కుక్కర్లో మటన్ బోన్ సూప్ చాలా సులువుగా వండేయచ్చు. దీనిలోనే మటన్ ఎముకలు వేగంగా ఉడుకుతాయి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యిని వేయండి. ఆ నెయ్యిలో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా వేసి ఉడికించుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించండి. ఇవన్నీ వేగాక కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ ను వేసి బాగా కలుపుకోండి. ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. మూత తీసాక అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపండి. అలాగే సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి కూడా బాగా కలపండి. టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించండి. ఆ తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా తరుగులు వేసి బాగా కలుపుకోండి. అవి ఉడకడానికి నాలుగు కప్పుల నీరుని వేయండి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి. ఆ తర్వాత మూత తీసి ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించండి. ఆ సమయంలో మిరియాల పొడిని పైన చల్లుకోండి. తర్వాత స్టవ్ కట్టేయండి. టేస్టీ మటన్ బోన్ సూప్ రెడీ అయిపోతుంది.

ఎముకల సమస్యలు ఉన్నవారు క్యాల్షియం లోపంతో బాధపడేవారు మటన్ బోన్ సూపును తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. దీన్ని చపాతీ, రోటీ వంటి వాటితో తినవచ్చు. లేదా నేరుగా కూడా తినవచ్చు. అన్నంలో కలుపుకున్నా ఇది రుచిగానే ఉంటుంది.

Also Read: అమ్మాయిలూ.. మగాళ్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే,డైలీ మీరు చెక్ చేయాల్సినవి ఇవే

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×