E-Paper
Advertisement

Jr NTR : డైరెక్టర్ సార్ ఒక్క ఛాన్స్ ప్లీజ్…‌ తారక్ ఈ పద్దతి ఇక మార్చుకోవా…?

Jr NTR : డైరెక్టర్ సార్ ఒక్క ఛాన్స్ ప్లీజ్…‌ తారక్ ఈ పద్దతి ఇక మార్చుకోవా…?
Advertisement

Jr NTR : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరోస్ లో ఎన్టీఆర్ ఒకరు. తన కెరియర్ లో వరుసగా సినిమాలు చేసి తన టాలెంట్ ను తెలుగు ప్రేక్షకులకు చూపించాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎంతమంది దర్శకులతో పనిచేసిన కూడా రాజమౌళి(Rajamouli) ఎన్టీఆర్(Ntr) కాంబినేషన్ అంటే ఒక రకమైన అంచనాలు ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు దాదాపు నాలుగు సినిమాల వచ్చాయి. ఈ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. వాస్తవానికి నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. చాలామందికి ఆ సినిమా ఉంది అనే ఒక విషయం కూడా తెలియదు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకొని ఎన్టీఆర్ రీ ఎంట్రీ కి మంచి ప్లస్ అయింది.

ఇక ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో చాలామంది దర్శకులు ఎన్టీఆర్ తమని పిలిచి సినిమా చేయమన్నారు అంటూ గతంలో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా చాలా సినిమా వేదికల పైన చాలామంది దర్శకులను నాతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అంటూ అభిమానుల ముందే అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని గురించి చాలామంది దర్శకులు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. చాలామంది కొరియోగ్రాఫర్స్ కూడా డాన్స్ విషయంలో కూడా తారకు ఒకసారి చూస్తే ఇట్టే పట్టేస్తారు అంటూ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తారక్ లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏంటి అంటే.? మిగతా దర్శకులను తనతో సినిమా చేయమని అడగడం అని కొంతమంది భావిస్తుంటారు.

Advertisement

Jr NTR

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా హిట్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య అనే సినిమాను చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ గా మిగిలింది. కిక్ సినిమా హిట్ అయిన తర్వాత ఎన్టీఆర్ తో చేసిన ఊసరవెల్లి సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. కందిరీగ వంటి హిట్ సినిమా అందుకున్న తర్వాత ఎన్టీఆర్ తో రభస అనే సినిమాను చేశాడు సంతోష్. ఇక ఆ సినిమా ఫలితం కూడా మనకు తెలిసిందే. ఇక బోయపాటి సింహా సినిమా తర్వాత ఎన్టీఆర్ తో దమ్ము అనే సినిమాను చేశాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఇలా హిట్ అయిన దర్శకులతో ఏరుకోరి సినిమాలు చేయటం వలన బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ ని చూశాడు తారక్.

Advertisement

Jr NTR

కానీ టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఆలోచన పూర్తిగా మారిపోయింది. ప్లాప్స్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసిన కూడా వరుసగా హిట్స్ కొడుతున్నాడు. ఇక ఎన్టీఆర్ తన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నారు అనుకునే తరుణంలో ఇప్పుడు ఒక కోలీవుడ్ దర్శకుడు తనతో సినిమా చేయమని అడుగుతున్నాడు ఎన్టీఆర్. దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనతో డైరెక్ట్ తమిళ్ సినిమా చేయమని ఆన్ స్టేజ్ వెట్రిమారన్ ను అడిగారు ఎన్టీఆర్. తమిళ్లో చేసిన సినిమాను తెలుగులో డబ్ చేద్దామని కూడా చెప్పుకొచ్చారు. దీంతో చాలామంది ఎన్టీఆర్ కు ఇంకా ఆ అలవాటు పోలేదు అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×