BigTV English

Trivikram Political Movie: పొలిటికల్ డ్రామా తీయాలంటే అది ఇప్పుడు త్రివిక్రమ్ చేతిలోనే ఉంది

Trivikram Political Movie: పొలిటికల్ డ్రామా తీయాలంటే అది ఇప్పుడు త్రివిక్రమ్ చేతిలోనే ఉంది

Trivikram Political Movie: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్వయంవరం సినిమాతో రచయితగా అడుగుపెట్టిన త్రివిక్రమ్. కొద్దికాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాలకు రచయితగా పనిచేసి నువ్వే నువ్వే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ లో నువ్వే నువ్వే, అ ఆ సినిమాలు మినహాయిస్తే మిగిలిన సినిమాలు అన్నీ కూడా కేవలం స్టార్ హీరోస్ తో పనిచేశారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు, సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూడు సినిమాలు, అల్లు అర్జున్ మూడు సినిమాలు చేశారు త్రివిక్రమ్.


పవన్ కళ్యాణ్ తో చేసిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయింది. ఇక మహేష్ బాబుతో చేసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే రెండవసారి పనిచేసిన ప్రతి డైరెక్టర్ ప్లాప్ సినిమా ఇస్తే, త్రివిక్రమ్ మాత్రం రెండవసారి అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అయితే వీరి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం అజ్ఞాతవాసి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ చవి చూసింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిపోయారు.

Diwali Movies : రెండు సినిమాలు ఒకే ఓటీటీలోకి.. మూవీ లవర్స్ కు ఇక పండగే..


త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ఒత్తిడి వలన మళ్ళీ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు మంచి టాక్ సాధించిన కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీనికి కారణం అప్పట్లో ఉన్న ప్రభుత్వం టికెట్ రేట్లను చాలా తక్కువగా పెట్టడం. ఇక భారీ పొలిటికల్ మూవీని చేయనున్నట్లు రీసెంట్గా జరిగిన లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో నాగ వంశీ అనౌన్స్ చేశాడు. ఒక పెద్ద స్టార్ హీరో అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే. 2029 ఎలక్షన్స్ కంటే ముందు పొలిటికల్ సినిమా ఉంటుంది అంటే అది ఖచ్చితంగా త్రివిక్రమ్ మాత్రమే డైరెక్షన్ చేస్తారు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కి ఒక హిట్ సినిమా ఆల్రెడీ ఇవ్వాల్సి ఉంది. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ సినిమా చేయలేదు. ఒకవేళ చేస్తే త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో చేస్తారు అనడంలో అనుమానం లేదు. వంశీ చేసిన వ్యాఖ్యలను బట్టి హారిక హాసిని క్రియేషన్స్ లో ఖచ్చితంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పొలిటికల్ సినిమా రానుంది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×