BigTV English

Diwali Movies : రెండు సినిమాలు ఒకే ఓటీటీలోకి.. మూవీ లవర్స్ కు ఇక పండగే..

Diwali Movies : రెండు సినిమాలు ఒకే ఓటీటీలోకి.. మూవీ లవర్స్ కు ఇక పండగే..

Diwali Movies : దీపావళికి కొత్త సినిమాల సందడి ఎక్కువే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి.. ఆ సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మొత్తానికి ఈ దీపావళి పండుగ సినిమాలకు కలిసి వచ్చింది. ఇక అమరన్‌, లక్కీ భాస్కర్ సినిమాలు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. దేశభక్తి ప్రధాన కథాంశంతో అమరన్ మూవీ తెరకెక్కగా.. బ్యాంక్ స్కామ్ బ్యాక్‌ డ్రాప్‌లో లక్కీ భాస్కర్ మూవీ రూపొందింది.. ఈ సినిమాలు ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇక ఈ మూవీల ఓటీటీ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం..


‘అమరన్’ మూవీ.. 

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ మూవీలో శివకార్తికేయన్‌, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించిన ఈ మూవీని ప్రముఖ హీరో, విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మించారు. దాంతో మొదటినుంచి ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లేదు వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మేజర్ ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్‌, ఇందు రెబెకా జాన్ పాత్రలో సాయిపల్లవి నటన అద్భుతమంటూ ఆడియెన్స్ చెబుతోన్నారు. అమరన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ తొలిరోజు భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 21 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.


‘లక్కీ భాష్కర్’ మూవీ.. 

ఇక లక్కీ భాస్కర్ విషయానికొస్తే.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బ్యూటీ ఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ లక్కీ భాష్కర్.. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. కుటుంబ బాధ్యతల్ని నెరవేర్చడానికి ఓ సాధారణ బ్యాంక్ క్లర్క్ చేసిన ఓ పెద్ద స్కామ్ చుట్టూ కథను రాసుకున్నాడు డైరెక్టర్.. ఇక ఈ సినిమా మొదటి షోతోనే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. డైరెక్ట్‌గా తెలుగులో రూపొందిన ఈ మూవీ మలయాళం, తమిళ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. అమరన్‌తో పాటు లక్కీ భాస్కర్ మూవీ రెండింటికి జీవి ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ను అందించారు.

ఈ రెండు సినిమాల ఓటీటీ అప్డేట్స్.. 

లక్కీ భాష్కర్, అమరన్ మూవీలు రెండు థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ఏ ఓటీటీలోకి వస్తాయో అని అనుకున్నారు. ఈ రెండు సినిమాలు చివరకు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయని టాక్.. ఈ రెండు సినిమాల డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత అమరన్‌, లక్కీ భాస్కర్ ఓటీటీలోకి రానున్నట్లు చెబుతోన్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో అమరన్‌, లక్కీ భాస్కర్ సినిమాలు రిలీజ్ కానున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ మూవీల స్ట్రీమింగ్ డేట్ వచ్చే వరకు వెయిట్ చెయ్యాలి.. త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×