BigTV English

IPL 2025 Retention: రింకూకు 2000 శాతం రేట్‌..ఐపీఎల్‌ లో ఈ ప్లేయర్లకు పంట పడింది !

IPL 2025 Retention: రింకూకు 2000 శాతం రేట్‌..ఐపీఎల్‌ లో ఈ ప్లేయర్లకు పంట పడింది !

IPL 2025 Retention: ఐపీఎల్‌ 2025 ( IPL 2025 ) వేలానికి సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ రిటెన్షన్ ( IPL 2025 Retention ) ప్లేయర్ల జాబితా గురువారం రోజున రిలీజ్ చేశారు. ఆటగళ్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ, ఆర్థిక వ్యూహాలతో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను అనౌన్స్ చేశాయి. ప్రతి ఒక్కరూ ఊహించినట్టుగానే కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను…. పంజాబ్ కింగ్స్ అత్యల్పంగా ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంది.


IPL 2025 Retentions Dhruv Jurel, Rinku Singh and Other Players Who Got Biggest Salary Hikes
IPL 2025 Retentions Dhruv Jurel, Rinku Singh and Other Players Who Got Biggest Salary Hikes

ఎమ్మెస్ ధోని వచ్చే సీజన్ లో సీఎస్కే లో కొనసాగనున్నాడు. అయితే తమ ఆటగాళ్ళను రిటైన్ చేసుకోవడానికి ఆయా ఫ్రాంచైజీలు భారీగా డబ్బులను కురిపించాయి. మొదటి ప్రాధాన్యతకు బీసీసీఐ నిర్ణయించిన రూ. 18 కోట్లను రిటైన్ ధర కంటే ఎక్కువగా చెల్లిండం జరిగింది కొన్ని ఫ్రాంచైజీలు. ఐపీఎల్ 2025కు సంబంధించి ప్రకటించిన పది ఫ్రాంచైజీల రిటైన్ జాబితాలో హెన్రీచ్ క్లాసేన్ కు భారీ ధర పలికారు. ఈ దక్షిణాఫ్రికా విద్వాంసకర బ్యాటర్, వికెట్ కీపర్ కు సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 23 కోట్లను చెల్లించింది. కోహ్లీకి రూ. 21 కోట్లు ఇచ్చేందుకు బెంగుళూరు నిర్ణయం తీసుకుంది.

Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?


ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కత్తా నైట్ రైడర్స్ యంగ్ ప్లేయర్ రింకు సింగ్ ను ( Rinku Singh ) రూ. 13 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. అయితే తనను కేకేఆర్ రిటైన్ చేసుకోవడం పట్ల రింకు కాస్త ఎమోషనల్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఓ పోస్టును సైతం షేర్ చేసుకున్నాడు రింకూ సింగ్‌ ( Rinku Singh ). “మా ప్రేమ కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంకా సినిమా చాలా మిగిలే ఉంది” అంటూ పోస్ట్ కు క్యాప్షన్ చేశాడు రింకూ సింగ్‌ ( Rinku Singh ).. “కేకేఆర్ కుటుంబానికి నమస్తే. ఏడేళ్ల కిందట నేను కోల్కత్తా జెర్సీ వేసుకున్నాను. ఇది నా ఒక్కడి విజయగాత కాదు. నా ప్రతి విజయంలో, ఓటమిలో నాకు మద్దతుగా ఉన్నారని తెలిపారు రింకూ సింగ్‌ ( Rinku Singh ).

Also Read: Sanjiv Goenka on KL Rahul: కేఎల్ రాహుల్ స్వార్థ పరుడు, నమ్మక ద్రోహి !

ఈ ప్రయాణంలో చాలా నేర్చుకున్నాను. కేకేఆర్ నాపై నమ్మకాన్ని ఉంచింది. ఆ నమ్మకాన్ని నేను నిలుపుకుంటాను. ఇది ఓ కొత్త అధ్యాయం” అని వాయిస్ మెసేజ్ తో ఉన్న వీడియోను షేర్ చేసుకున్నాడు రింకూ సింగ్‌ ( Rinku Singh ). ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనికి “వెల్ డన్ ఛాంప్, ఆల్ ది బెస్ట్” అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాగా, 2024 ఐపీఎల్ సీజన్ కోల్కత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ. 55 లక్షలు చెల్లించింది. ఇక అటు ధ్రువ్‌ జురెల్‌ కు ( Dhruv Jurel) రూ.14 కోట్లు ఇచ్చింది రాజస్థాన్‌. శశాంక్‌ కు 5.50 కోట్లు ఇచ్చింది పంజాబ్‌.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×