E-Paper
Advertisement

Janvikapoor : ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని చెయ్యను.. జాన్వీ పాప షాకింగ్ డెసిషన్..!

Janvikapoor : ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని చెయ్యను.. జాన్వీ పాప షాకింగ్ డెసిషన్..!
Advertisement

Janvikapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరుకు ఇప్పుడు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య దేవర మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా ఈ ముద్దుగుమ్మ దేవర సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. జాన్వీ తల్లి శ్రీదేవికి టాలీవుడ్‌తో ఎలాంటి బంధం ఉందో తెలిసిందే. తన అందం, అమాయకత్వం, అభినయంతో లక్షలాదిమంది హృదయాలలో చెరగని ముద్రవేసుకుంది. ఆమె వారసురాలుగా జాన్వీ పాప మంచి క్రేజ్ ను అందుకుంది. ఎన్టీఆర్ సరసన జోడిగా చేసిన ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న జాను పాప కోట్లు ఇచ్చినా అలాంటి పని చెయ్యను అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. బాలీవుడ్ లో పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ హీరోగా.. స్టార్‌ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా దేవరలో హీరోయిన్ గా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్‌లతో దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ అమ్మడు తన తల్లితో అన్న మాటలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది.

Advertisement

తన అమ్మ శ్రీదేవికి ఇచ్చిన మాట గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఏ సినిమాలో అయినా జుట్టు లేకుండా ఉండే పాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటే తాను అస్సలు చెయ్యనని చెప్పిందట. నా జుట్టు కట్ చేసుకోవడానికి నేను అసలు ఇష్టపడనంటూ చెప్పుకొచ్చింది. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా నేను సిద్ధమే అన్న పాప ఇప్పుడు ఇలా అనడం పై ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. తన పాత్రల కోసం జుట్టు కట్ చేసుకోవాల్సి వస్తే అలాంటి రోల్స్ నేను చేయను.. నన్ను సంప్రదించవద్దంటూ జాన్వి కామెంట్స్ చేసింది. ప్రస్తుతం జాన్వి చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు ఆ తర్వాత మూడు సినిమాలను లైన్లో పెట్టుకుంది.. రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో పాటుగా మరో రెండు సినిమాలను లైనప్ లో పెట్టుకుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×