BigTV English

OTT Movie : వరుస యాక్సిడెంట్స్… అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మర్డర్ మిస్టరీ

OTT Movie : వరుస యాక్సిడెంట్స్… అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మర్డర్ మిస్టరీ

OTT Movie : కొత్త కొత్త మర్డర్ మిస్టరీ మూవీస్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఈ సినిమాలో జరిగే వరస మర్డర్స్ ను ఇన్వెస్టిగేట్ చేసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఈ మూవీ ఏ ఓటీ టిలో అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెలలోపే ఓటీటీలోకి…

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ఈ మలయాళం హిస్టరీ థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీకి కన్నన్ దర్శకత్వం వహించగా, నిక్కీ గల్రాని, ఆశా శరత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటికే రిలీజ్ అయింది. తమిళంలో ‘విరిందు’ అనే టైటిల్ తో థియేటర్లలోకి రాగా, మలయాళంలో మాత్రం ‘విరున్ను’ అనే టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కానీ స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో సినిమా ఆడలేదు. కానీ థియేటర్లలో ఇలా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటిటిలో అదరగొట్టడం మనం ఇప్పటికే చాలాసార్లు చూసాం. ఈ మూవీ సంగతి ఎలా ఉంటుందో తెలియదు గానీ అక్టోబర్ 4 నుంచి సింప్లీ సౌత్ అనే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. కానీ సింప్లీ సౌత్ అనేది ఇండియన్ ఆడియన్స్ కు అందుబాటులో లేదు. ఓవర్సీస్ ఆడియన్స్ మాత్రమే ఇందులో సినిమాను చూడగలరు. ఇక ఇండియన్ ఆడియన్స్ కోసం ఈ మూవీ మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో అక్టోబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఓటీటీలోకి అయితే ఇంత ఫాస్ట్ గా వచ్చేసింది గానీ, థియేటర్లలోకి రావడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. 2021 లోనే ‘వీరున్ను’ అనే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల మూవీ రిలీజ్ వాయిదా పడి ఏకంగా మూడేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చింది. కాబట్టి ప్రేక్షకులకు ఈ మూవీ ఔటేటెడ్ స్టోరీ అని అనిపించి ఉండవచ్చు.


స్టోరీలోకి వెళ్తే…

సినిమాలో జాన్, ఎలిజిబెత్ అనే ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. వాళ్లకి పెర్లీ అనే అమ్మాయి ఉంటుంది. ఈ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. జాన్ ఒకరోజు ఆఫీస్ కి వెళ్లి వస్తూ చనిపోతాడు. అతని మరణం అనుమానాస్పదంగా మారుతుంది. తండ్రి చనిపోయాడు అన్న వార్తను జీర్ణించుకోక ముందే తల్లి ఎలిజిబెత్ కూడా ఒక రోజు యాక్సిడెంట్లో కన్నుమూస్తుంది. దీంతో తల్లిదండ్రుల మరణానికి ఇంకా ఏదో కారణం ఉందనే అనుమానం కలుగుతుంది పెర్లీకి. ఈ కేసును నారాయణన్ అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. మరి ఈ ఇద్దరు భార్యాభర్తల హత్యల వెనుకున్న మిస్టరీ ఏంటి? ఎందుకు హత్య చేశారు? నారాయణన్ ఒక్కడే ఈ కేస్ ని సాల్వ్ చేయగలిగాడా,? ఇన్వెస్టిగేషన్లో పెర్లి పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. మూడేళ్ల తర్వాత అర్జున్ నటించిన మలయాళ సినిమా ఇది.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×