BigTV English

Disha Patani: సూర్య 42… సెట్స్‌లో దిశా ప‌టాని సంద‌డి

Disha Patani: సూర్య 42… సెట్స్‌లో దిశా ప‌టాని సంద‌డి

Disha Patani:కోలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు సూర్య గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సినిమా సినిమాకు వేరియేష‌న్‌ను చూపిస్తూ సినిమాలు చేసే ఈ వెర్స‌టైల్ హీరోకి టాలీవుడ్‌లో ఫ్యాన్స్ బేస్ మాత్ర‌మే కాదు.. మంచి మార్కెట్ కూడా ఉంది. అందుక‌నే సూర్య త‌న సినిమాల‌ను త‌మిళంతో పాటు తెలుగులో విడుద‌ల చేయ‌టానికి ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ఇప్పుడు సూర్య త‌న 42వ సినిమాను శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టాని హీరోయిన్‌గా న‌టిస్తుంది.


ప్ర‌స్తుతం సూర్య 42 లేటెస్ట్ షెడ్యూల్‌లో దిశా ప‌టాని పాల్గొంది. తెలుగు సినిమా లోఫ‌ర్‌తో త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసిన దిశా ప‌టాని త‌ర్వాత ఎందుక‌నో బాలీవుడ్ సినిమాల‌కే ప‌రిమిత‌మైంది. అయితే ఇప్పుడామె త‌న ఆలోచ‌న‌ను మార్చుకుంది. ఇప్ప‌టికే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ K చిత్రంలో న‌టిస్తోంది. దీంతో పాటు ఇప్పుడు సూర్య 42లోనూ న‌టిస్తుంది. కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్‌తో సూర్య 42ను సినిమా రూపొందుతోంది. పీరియాడిక్ మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని త్రీడీ టెక్నాల‌జీతో ప‌ది భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

రీసెంట్‌గా బాలా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా నుంచి క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా సూర్య త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న త‌న 42వ సినిమాపై ఫోక‌స్ పెట్టారు. దీని త‌ర్వాత జై భీమ్ 2ను కూడా సూర్య రూపొందించ‌నున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×