Big Stories

Macharla: మాచర్ల రౌడీ!?.. ఏ1 గా తురకా కిశోర్.. బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు

Macharla: తురకా కిశోర్. ఈ పేరు ఏపీలో ఫుల్ పాపులర్. వైసీపీ నేతగా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గా కంటే కూడా.. రౌడీ ఇమేజ్ తోనే ప్రాచుర్యం ఎక్కువ. ఎమ్మెల్యే పిన్నెల్లికి ప్రధాన అనుచరుడైన తురకా కిశోర్.. గొడవల్లో అందరికంటే ముందుంటున్నారు. తాజా మాచర్ల ఘర్షణల్లోనూ ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నాడు. అనుచరులను వెంటేసుకుని.. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టడం.. కార్లు ధ్వంసం చేయడం.. అపార్ట్ మెంట్లో చొరబడి విధ్వంసం చేయడం.. తదితర ఆరోపణలతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆయనతో పాటు మరో 10 మందిపైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.

- Advertisement -

మాచర్ల ఘర్షణ బీభత్సం సృష్టించింది. ఎవరు ఎవరిపై దాడి చేశారనేది పక్కనపెడితే.. దాడులు మాత్రం దారుణంగా జరిగాయి. ఆ విజువల్స్ చూస్తుంటేనే భయం పుడుతోంది. రాళ్లతో కొట్టడం, కర్రలతో దాడి చేయడం, ఇల్లు, కార్లు తగలబెట్టడం.. మాచర్లలో రణరంగంమే నడిచింది.

- Advertisement -

మాచర్లలో వైసీపీ దాడి అనగానే.. మొదట అందరి దృష్టి తురకా కిశోర్ వైపే మళ్లింది. అనుకున్నట్టుగానే.. ఆయనే ఏ1 నిందితుడిగా తేల్చారు పోలీసులు. దీంతో, తురకా కిశోర్ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడే కాదు.. గతంలోనూ అతని పేరు ఇదే తరహా ఘటనలో రాష్ట్రవ్యాప్తంగా వినిపించింది. మూడేళ్ల క్రితం మున్సిపల్ ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున మాచర్లలో పర్యటించిన బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై దాడి చేసింది తురకా కిశోరే. టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న కారును వెంబడించి.. పెద్ద కర్రతో వాహనంపై దాడి చేశాడు. కారు అద్దాలు పగలగా.. డ్రైవర్ అప్రమత్తతతో బోండా, బుద్దాలు సురక్షితంగా బయటపడ్డారు. ఆ విజువల్స్ అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యాయి. అప్పుడే మాచర్ల రౌడీగా.. తురకా కిశోర్ పేరు ఏపీలో మారుమోగిపోయింది. కట్ చేస్తే, ఆ తర్వాత కిశోర్ కు మున్సిపల్ ఛైర్మన్ కిరీటం కట్టబెట్టడం మరింత సంచలనంగా మారింది. లేటెస్ట్.. మాచర్ల గొడవలోనూ మళ్లీ తురకా కిశోరే ప్రధాన నిందితుడిగా నిలవడంతో.. అతనికిగ మాచర్ల రౌడీ అనే బిరుదు ఫిక్స్ అయినట్టే అంటున్నారు.

మాచర్ల ఘర్షణపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. మాచర్ల టీడీపీ ఇంచార్జ్ బ్రహారెడ్డిని ఏ1గా చేర్చుతూ హత్యాయత్నం కేసు పెట్టారు. బ్రహ్మారెడ్డితో పాటు మరో 9 మంది పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇక, తురకా కిశోర్ ను ఏ1 గా చేర్చుతూ.. 10మంది వైసీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మాపై దాడి చేసి, మాపైనే హత్యాయత్నం కేసు పెట్టడమేంటని టీడీపీ నేత బ్రహ్మారెడ్డి ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వాళ్లే రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పారని వైసీపీ వర్గం రివర్స్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇరుపక్షాలపై కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News