BigTV English

Megastar Chiranjeevi : చిరంజీవి డైరెక్టర్ గా చేసిన ఒకే ఒక్క సినిమా.. హిట్ కొట్టిందా..?

Megastar Chiranjeevi : చిరంజీవి డైరెక్టర్ గా చేసిన ఒకే ఒక్క సినిమా.. హిట్ కొట్టిందా..?

Megastar Chiranjeevi : టాలీవుడ్ కా బాప్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలో తన పేరును సువర్ణక్షరాలతో రాయించుకొనే స్థాయికి ఏదిగాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. మూడు దశాబ్దాలపాటు అగ్ర కథానాయకుడిగా కొనసాగి.. ప్రస్తుతం కూడా సినిమాలు చేస్తూ యువ కథానాయకుల కు సవాల్ విసురుతున్నారు చిరంజీవి.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేస్తున్నాడు.. ఇక చిరంజీవి గురించి ఇన్నాళ్లకు ఓ నిజం బయటకు వచ్చింది. ఈయన డైరెక్టర్ ఓ సినిమా చేశాడట. ఆ మూవీ గురించి మెగా ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకి ఆ మూవీ ఏంటి? కలెక్షన్స్ ఎంత? అనేది ఒకసారి చూద్దాం..


పవన్ కళ్యాణ్ గతంలో ఓ మూవీకి డైరెక్టర్ గా పనిచేసారు. కానీ చిరంజీవి ఎక్కడా డైరెక్టర్ గా ఓ సినిమా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరు ఇప్పటివరకు 153 సినిమాలు చేశాడు. కానీ ఓ సినిమాకు డైరెక్టర్ గా పని చేశారట.. ఆ సినిమాను కోట్ల మంది చూశారు.. అంతేకాదు హిట్ టాక్ ను అందుకోవడం తో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇంతకీ ఆ మూవీ ఏదో అనుకుంటున్నారా? ఆ మూవీ ఇంద్ర అట.. అదేంటి ఇంద్ర మూవీ బి.గోపాల్ కదా అనే డౌట్ మీకు రావొచ్చు.. అవును ఆయనతో పాటుగా చిరంజీవి కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేశారట.. ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించి సంగతి తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో బి.గోపాల్ మాట్లాడుతూ ఇంద్ర సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోపాటు మరికొన్ని సన్నివేశాలకు చిరంజీవి దర్శకత్వం వహించారని చెప్పారు.. అంతేకాదు కొన్ని సీన్లను ఆయనే స్వయంగా రాసుకున్నారట.

ఇంద్ర మూవీని అప్పటిలో దాదాపుగా రెండు కోట్లకు పైగా చూశారట. అప్పటివరకు ఏ తెలుగు సినిమాకు లేనంతగా రూ.30 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంద్ర సినిమాకు ముందు చాలా సినిమాలు ఫ్లాప్ అవడం తో మాస్, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అదేవిధంగా ఇంద్ర సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా ఎలాంటి టాక్ నందుకు ఉందో బాక్సాఫీస్ రికార్డులను ఎలా బ్రేక్ చేసిందో తెలిసిందే.. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో చిరు మళ్లీ హిట్ ట్రాక్ ను అందుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన హిట్ సినిమా పడలేదు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ సమ్మర్ కు రిలీజ్ కాబోతుంది. చిరు ఆశలన్నీ ఈ మూవీ పైనే ఉన్నాయి. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. త్రిష ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×