Health Tips: చలికాలంలో అందరూ వేరుశనగలను తినడానికి ఇష్టపడతారు. వేరుశనగలో ప్రోటీన్, ఫైబర్ , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి. కానీ వేరుశనగ తిన్న తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఆరోగ్యానికి కూడా హానికరం. ముఖ్యంగా చల్లటి నీరు త్రాగడం స్వీట్లు ,తినడం వంటి రెండు అలవాట్లు మీరు మానుకోవాలి.
చల్లని నీరు త్రాగడం మానుకోండి :
వేరుశనగలు తిన్న వెంటనే చల్లటి నీరు త్రాగే అలవాటు మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణం, కడుపులో భారం వంటి సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా చల్లటి నీరు శరీర ఉష్ణోగ్రతను అకస్మాత్తుగా తగ్గిస్తుంది. దీని కారణంగా వేరుశనగలో ఉన్న కొవ్వు సరిగా జీర్ణం కాదు. ఇప్పటికే ఎసిడిటీ, గ్యాస్ వంటి కడుపు సమస్యలతో బాధపడేవారికి ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి, వేరుశనగ తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల పాటు చల్లటి నీటిని తాగకుండా ఉండాలి.
Also Read: కొబ్బరి నూనెను ఇలా వాడితే.. రెట్టింపు అందం మీ సొంతం
స్వీట్లు తినడం మానుకోండి :
వేరుశనగ తిన్న వెంటనే స్వీట్లు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. వేరుశనగలో తగినంత కేలరీలు, కొవ్వులు ఉన్నాయి. దీని తర్వాత స్వీట్లు తింటే శరీరంలో షుగర్, క్యాలరీలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది బరువు పెరుగుట, రక్తంలో చక్కెర స్థాయిల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు వేరుశనగ, స్వీట్ల కలయిక జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గ్యాస్ , అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు చాలా ప్రమాదకరం. అందువల్ల, వేరుశనగ తిన్న తర్వాత స్వీట్లు తినకుండా ఉండండి.